రాష్ట్రంలో సంచలనం రేపిన డెడ్ బాడి పార్సిల్ కేసులో దర్యాప్తు సమర్ధవంతంగా చేసిన పశ్చిమ పోలీసులు ప్రతిష్టాత్మ్కక పథకానికి ఎంపికయ్యారు. ప్రతియేటా సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినోత్సవం సందర్భంగా నేర పరిశోధనలో అత్యంత ప్రతిభకనబరిచిన పోలీసులకు కేంద్రం ఈ పతకాలను అందచేస్తుంది..
ఏలూరు, అక్టోబర్ 31: రాష్ట్రంలో సంచలనం రేపిన డెడ్ బాడి పార్సిల్ కేసులో దర్యాప్తు సమర్ధవంతంగా చేసిన పశ్చిమ పోలీసులు ప్రతిష్టాత్మ్కక పథకానికి ఎంపికయ్యారు. ప్రతియేటా సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినోత్సవం సందర్భంగా నేర పరిశోధనలో అత్యంత ప్రతిభకనబరిచిన పోలీసులకు కేంద్రం ఈ పతకాలను అందచేస్తుంది. ఈ సందర్భంగా నేడు ఆంధ్రప్రదేశ్ పోలీసులకు ఈ అత్యున్నత పురస్కారం లభించటం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మినిస్ట్రీ అఫ్ హోమ్ ఎఫైర్స్ ఈ కేంద్రీయ గృహమంత్రి దక్షత పతకాలను ప్రకటించగా ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ నయీమ్ అస్మి, అడిషనోల్ ఎస్పీ భీమారావు , డీఎస్పీ జయసూర్య , ఎస్ఐ నసీరుల్లాలకు ఈ పతకాలు ఎంపిక అయ్యారు.
కేసు వివరాలేంటి … నిందితులు ఎలా చిక్కారు …?
పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం యండగండికి చెక్క పెట్టె డెడ్ బాడీని పంపించాడు శ్రీధర్ వర్మ. తన వదిన తులసీకి చెందిన ఆస్తిని కాజేసేందుకు శ్రీధర్ వర్మ, రెండవ భార్య రేవతి, ప్రియురాలు సుష్మా కలిసి ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. రేవతికి తులసి స్వయానా చెల్లెలు. రేవతి ప్లాన్ తోనే శ్రీధర్ వర్మ, సుష్మా కుట్ర చేశారు. ఈ ముగ్గురు కలిసి పర్లయ్యను హత్య చేసినట్టు తేలింది. శవాన్ని ఇంటికి పంపడం ద్వారా తులసిని భయపెట్టి ఆస్తి పత్రాలపై సంతకాలు చేయాలని ఒత్తిడి చేసారు. ఎక్కడైనా శవం దొరుకుతుందేమో అని గాలించి, దొరక్కపోవడంతో పర్లయ్యను హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. ఒంటరిగా నివాసం ఉంటున్న పర్లయ్యను పనికి పిలిచి, మద్యం తాగించి, నైలాన్ తాడును మెడకు బిగించి, హత్య చేసినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. గాంధీనగర్ లో శవాన్ని చెక్క పెట్టేలో పెట్టి అక్కడి నుండి యండగండి పార్సిల్ పంపించారు.
శ్రీధర్ వర్మ క్రిమినల్ మైన్డ్ కలిగిన వ్యక్తి. ఇద్దరిని పెళ్ళి చేసుకుని మరో ప్రియురాలుతో కలిసి ఉంటున్నాడు. గతంలో చేపలు, చెరువులపై దొంగతనాలకు పాల్పడినట్టు తెలుస్తోంది. శ్రీధర్ వర్మ గుర్తింపు కార్డులు కూడా లేకుండా జాగ్రత్త పడ్డాడు. ఎప్పుడూ ముఖానికి మాస్క్, హెల్మెట్ పెట్టుకుని ఎవ్వరికీ కనిపించకుండా తిరుగుతాడు ఈ కేటుగాడు. చెక్క పెట్టెలో శవాన్ని చూసి తీవ్ర ఆందోళనకు గురౌతున్న తులసిని కలిసి.. అంతా తాను చూసుకుంటానని ఆస్తి పత్రాలపై సంతకాలు చేయమని తీవ్ర ఒత్తిడి తెచ్చాడు. లేకపోతే నిన్ను చంపేస్తానని తులసిని బెదిరించాడు. తులసి వద్ద సెల్ ఫోన్ లాగేసుకున్నాడు. తులసి కోసమే రెండో చెక్క పెట్టె చేయించాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాత్రూంకు వెళ్లిన తులసి తనదగ్గర ఉన్న మరో ఫోన్ తో సన్నిహితులకు, పోలీసులకు సమాచారం అందించింది. వెంటనే అక్కడనుంచి పరారయ్యాడు శ్రీధర్ వర్మ.
శ్రీధర్ వర్మ తన ప్రియురాలు సుష్మా, కుమార్తెతో కారులో కృష్ణాజిల్లా బంటుమిల్లి మీదుగా కారులో పారిపోయాడు. తాళ్ళపూడిలో కారు వదిలేసి లాడ్జ్ లో రూం తీసుకొని ఉన్నాడు. పోలీసులకు దొరక్కుండా కారు వదిలేసి, ఆటోలో ప్రయాణం చేసాడు. పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు 40 సిమ్ కార్డులు, ఫోన్లు ఉపయోగించాడు. శ్రీధర్ వర్మ బ్యాంకు ఖాతాలు భారీ మెత్తంలో నగదు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మచిలీపట్నంలో అద్దె ఇల్లు తీసుకునేందుకు ప్లాన్ చేసాడు. సీసీ కేమేరాలు, సెల్ ఫోన్ కాల్ ట్రాకింగ్ ద్వారా శ్రీధర్ వర్మను గుర్తించారు పోలీసులు. పోలీసులు గుర్తించలేనంతగా వేషం మార్చాడు శ్రీధర్ వర్మ. నీట్ గా హెయిర్ కట్ చేయించాడు. అతడు వాడిన టోపీని చూసి శ్రీధర్ వర్మను కన్ఫర్మ్ చేసుకున్నారు పోలీసులు. వెంటనే అదుపులోనికి తీసుకున్నారు. తమదైన స్టైల్లో విచారణ చేపట్టగా నిందితుడు శ్రీధర్ వర్మ నేరాన్ని అంగీకరించాడు.
Also read
- కార్తీక పౌర్ణమి 2025 తేదీ.. పౌర్ణమి తిథి, పూజకు శుభ ముహూర్తం ఎప్పుడంటే?
 - శని దృష్టితో ఈ రాశులకు చిక్కులు.. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది
 - సాక్షాత్తు ఆ చంద్రుడు ప్రతిష్ఠించిన లింగం! పెళ్లి కావాలా? వెంటనే ఈ గుడికి వెళ్లండి!
 - ఆ విషయాన్ని పట్టించుకోని అధికారులు.. కలెక్టరేట్లో పురుగుల మందు తాగిన రైతు..
 - Viral: ఆ కక్కుర్తి ఏంటి బాబాయ్.! ప్రెగ్నెంట్ చేస్తే పాతిక లక్షలు ఇస్తామన్నారు.. చివరికి ఇలా
 





