చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లు అడ్డంగా బుక్కయ్యారు. 20 ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తూ పుంగనూరు పోలీసులకు దొరికిపోయారు. నిందితుల్లో ఒకరు పట్టుపడగా మరో ముగ్గురు పారిపోయారు. నిందితుల నుంచి రూ.33లక్షల విలువైన ఎర్రచందనం సహా ఒక కారును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఘటనపై కేసు నమోదు చేసి పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.
చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లు అడ్డంగా బుక్కయ్యారు. 20 ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తూ పుంగనూరు పోలీసులకు దొరికిపోయారు. నిందితుల నుంచి రూ.33లక్షల విలువైన ఎర్రచందనం సహా ఒక కారును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నిందితుల్లో ఒకరు పట్టుపడగా మరో ముగ్గురు పారిపోయారు. వివరాల్లోకి వెళ్తే.. రాజంపేట నుంచి పుంగనూరు మీదుగా కర్ణాటకకు అక్రమంగా ఎర్ర చందనం తరలిస్తున్న స్మగ్లర్ల కారు అర్ధరాత్రి సమయంలో పుంగనూరు మండలం సుగాలిమిట్ట వద్ద వారి వాహనం బ్రేక్‌డౌన్ అయింది. ఇక రాత్రి కావడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్మగ్లర్లు మెయిన్ రోడ్ పక్కన కారును పార్క్ చేద్దామనుకున్నారు. దగ్గర్లోనే నేతి గుట్లపల్లి వద్ద ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్న రోడ్డులోకి కారును దారి మళ్లించారు. ఎత్తయిన ప్రాంతం నుంచి కారును తోసిన దొంగలు దాదాపు 2 రోడ్లు రెండు కిలోమీటర్ల దాకా కారును తీసుకెళ్లి అక్కడ నిలిపివేశారు.
కారులో ఉన్న ఎర్రచందనం దొంగలను ఎవరికి కనిపించకుండా దగ్గరలోని ముళ్ళపొదల్లో దాచారు. నలుగురు స్మగ్లర్లలో ముగ్గురు కారు వద్దే ఉండి, ఒక వ్యక్తి మెకానిక్‌ను తీసుకువచ్చేందుకు పుంగనూరుకు వెళ్లాడు. మెకానిక్ దొరకకపోవడంతో మార్నింగ్ వరకు అతను అక్కడే ఉండిపోయాడు. అయితే ఉదయం కావడంతో అటుగా వెళుతున్న స్థానికులు కారు వద్ద ఉన్న ముగ్గురు స్మగ్లర్లను చూశారు. వారు స్థానికులుగా కనిపించకపోవడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులను చూసి స్మగ్లర్లు పారిపోయే ప్రయత్నం చేశారు. వాళ్లను వెంబడించిన పోలీసులు ముగ్గురిలో ఒక స్మగ్లర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
మెకానిక్ కోసం వెళ్లిన స్మగ్లర్ తిరిగి కారు వద్దకు రాకపోగా, పరారైన ఇద్దరు స్మగ్లర్లు తప్పించుకున్నారు. మొత్తం నలుగురిలో ఒకర్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. పట్టుబడిన స్మగ్లర్ తమిళనాడులోని హోసూర్ ప్రాంతానికి చెందిన సర్దార్ బాషగా గుర్తించారు. వారు తెచ్చిన వాహనంతో పాటు అందులో ఉన్న రూ.33లక్షల విలువైన 20 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ఎర్రచెందనం మొత్తం ఏ గ్రేడ్ రకం ఎర్రచందనంగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు పరారైన వారి వివరాలను సేకరించి పట్టుకునేందుకు ప్రత్యేక టీములుగా ఏర్పడి గాలిస్తున్నారు.
Also read
- శీర్షాసనంలో శివయ్య..!
- హైదరాబాద్ నారాయణ కాలేజీలో దారుణం
- Sattenapalle: అప్పు వివాదం.. తల్లీ కుమారుడి ఆత్మహత్య
- Kadapa: జైల్లో దస్తగిరికి బెదిరింపులు.. మరోసారి విచారణ చేపట్టిన కర్నూలు ఎస్పీ
- Gollaprollu: బాకీ తీరుస్తానంటూ బావిలోకి తోశాడు