నందికొట్కూరులోని డిగ్రీ, పీజీ దూరవిద్య పరీక్ష కేంద్రంలో ఇద్దరు ప్రిన్సిపాల్స్ మధ్య తీవ్రమైన గొడవ జరిగింది. శ్రీ వైష్ణవి, సాయిరాం కాలేజీల ప్రిన్సిపాల్స్ తమ విద్యార్థులు కాపీ కొట్టకుండా ఒకరినొకరు అడ్డుకున్నారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లో దూరవిద్య పరీక్షల్లో వ్యాప్తి చెందుతున్న మాస్ కాపీయింగ్‌ను వెలుగులోకి తెచ్చింది. పోలీసులు జోక్యం చేసుకుని వారిని పంపించారు.
సాధారణంగా విద్యార్థులు పరీక్షలకు ముందు బాగా చదివి, పరీక్షల్లో బాగా రాసి, మంచి మార్కులు తెచ్చుకోవాలని టీచర్లు కోరుకుంటారు. అందుకోసం వారి ప్రయత్నంగా బాగా చదువు చెప్పడం, పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయడం, వారిలో భయం పోగొట్టేందుకు అసవరమైన గైడెన్స్ ఇవ్వడం చేస్తుంటారు. కానీ, ఎక్కడా లేని విధంగా ఓ ఇద్దరు ప్రిన్సిపాల్స్ తమ కాలేజీ విద్యార్థులను కాపీ కొట్టనివ్వడం లేదంటూ ఏకంగా పరీక్షా కేంద్రంలోనే గొడవకు దిగారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న వారు ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రిన్సిపాల్సే ఇలా కాపీ కొట్టనివ్వాలంటూ గొడవకు దిగుతుంటే.. ఇంకా ఆ విద్యార్థులకు చదువు ఏం వచ్చి చస్తుందంటూ మండిపడుతున్నారు.
ఇంతకీ ఈ ఘటన ఎక్కడో కాదు మన ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లాలో చోటు చేసుకుంది. నందికొట్కూరు డిగ్రీ, పీజీ దూరవిద్య పరీక్ష కేంద్రంలో ఇద్దరు ప్రిన్సిపాల్స్ మధ్య గొడవ జరిగింది. డిస్టెన్స్ పరీక్షలలో మా విద్యార్థులు చూసి రాయకుండా అడ్డుకుంటున్నారని శ్రీ వైష్ణవి, సాయిరాం కాలేజీల ప్రిన్సిపాల్స్ పరస్పరం వాగ్వాదానికి దిగారు. పరీక్ష కేంద్ర వద్ద విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు వారిని అక్కడి నుంచి పంపించేశారు. అయితే ఈ డిస్టెన్స్ పరీక్షల్లో విద్యార్థులు మాస్ కాపింగ్‌కు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి
Also read
- కార్మిక సంక్షేమ మండలి పధకాలను పునరుద్ధరించాలి…..ఐ.యఫ్.టి.యు.
- నేటి జాతకములు..4 ఏప్రిల్, 2025
- శ్రీ కృష్ణుడు మనవడు వజ్రనాభుడు నిర్మించిన ఆలయం ద్వారకాధీష ఆలయం.. ప్రాముఖ్యత ఏమిటంటే
- Dreams Theory: ముద్దు పెట్టుకుంటున్నట్లు కల కంటున్నారా.. ఆ కలకు అర్ధం తెలిస్తే ఆశ్చర్యపోతారు.
- కామదా ఏకాదశి: స్త్రీలకు సౌభాగ్యాన్ని ఇచ్చే కామద ఏకాదశి ఎప్పుడు? పూజా శుభ సమయం? నియమాలు