July 1, 2024
SGSTV NEWS
Andhra PradeshAssembly-Elections 2024Crime

Andhra pradesh news: ఏపీ ఫైబర్ నెట్ ప్రధాన కార్యాలయం వద్ద పోలీసుల భద్రత


విజయవాడలోని ఏపీ ఫైబర్ నెట్ ప్రధాన కార్యాలయం వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. కీలక దస్త్రాలను కొందరు ధ్వంసం చేసే అవకాశముందని నిఘా వర్గాల సమాచారంతో భద్రత పెంచారు.

విజయవాడ: విజయవాడలోని ఏపీ ఫైబర్ నెట్ ప్రధాన కార్యాలయం వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. కీలక దస్త్రాలను కొందరు ధ్వంసం చేస్తారని నిఘా వర్గాల సమాచారం రావడంతో భద్రతను పెంచారు. ముఖ్యమైన దస్త్రాలు, డేటా ఎవరూ బయటకు తీసుకెళ్లకుండా కాపలా కాస్తున్నారు. మూడు, నాలుగు ఫోర్లలో 24గంటల పాటు నిఘా పెట్టారు. కార్యాలయంలోకి వచ్చి, వెళ్లే సిబ్బందిని పోలీసులు క్షుణ్నంగా తనిఖీ చేసి పంపిస్తున్నారు. కార్యాలయంలోకి బయటి వారు వెళ్లకుండా చర్యలు చేపట్టారు.

ఈ నేపథ్యంలోనే ఫైబర్ నెట్ ప్రధాన కార్యాలయాన్ని సౌత్ జోన్ ఏసీపీ రతన్ రాజు, సైబర్ క్రైమ్ ఏసీపీ తేజేశ్వరరావు సందర్శించారు. ఏపీ ఎస్ఎఫ్ఎల్ ఎండీ ఎం. మధుసూధనరెడ్డి, ఫైనాన్స్, పరిపాలనశాఖలోని ఉన్నతాధికారులతో వారు సమావేశమయ్యారు. ఎట్టి పరిస్థితుల్లో ఫైళ్లు బయటకు వెళ్లేందుకు వీల్లేదని ఆదేశాలు జారీ చేశారు. ఈ-ఫైల్స్, డేటాను తొలగించొద్దని చెప్పారు. దస్త్రాలను జాగ్రత్తగా భద్రపరిచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

Also read

Related posts

Share via