అనంతపురం జిల్లా హృదయవిదారక ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. పాపం పసివాడు.. వాటర్ బాటిల్ క్యాప్ గొంతులో ఇరుక్కుని ఏడాదిన్నర పసివాడు మృతి చెందాడు. అనంతపురం జిల్లా గుత్తి పట్టణానికి చెందిన యుగంధర్, మౌనిక దంపతులకు ఏడాదిన్నర వయసున్న కుమారుడు రక్షిత్ రామ్ ఉన్నాడు. యుగంధర్, మౌనిక దంపతులిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులే..! యుగంధర్ అనంతపురంలోని ఆర్ అండ్ బి డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. మౌనిక గుత్తి పట్టణంలో ట్రాన్స్‌కో విభాగంలో ఏడీఈగా విధులు నిర్వహిస్తున్నారు.
మౌనికకు నైట్ షిఫ్ట్ ఉండడంతో.. ఏడాదిన్నర బాబును కూడా వెంట తీసుకుని విధులకు వెళ్లింది. మౌనిక విధి నిర్వహణలో ఉన్న సమయంలో ఏడాదిన్నర కుమారుడు ఆడుకుంటూ.. పొరపాటున వాటర్ బాటిల్ మూత మింగేశాడు. వాటర్ బాటిల్ మూత గొంతులో ఇరుకోవడంతో ఊపిరాడక విలవిల్లాడాడు. తల్లి మౌనిక వెంటనే బాలుడిని గుర్తించి గుత్తి ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు సీపీఆర్ చేశారు. అయినా ఫలితం లేకపోయింది. చివరకు బాలుడు రక్షిత్ రామ్ చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఒక్కగానొక్క కొడుకు మరణించడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు.
ఇంటి దగ్గర చిన్న బాబును చూసుకోవడానికి ఎవరూ లేరని, విధులకు హాజరవుతూ చంటి బిడ్డను చూసుకునేందుకు తీసుకెళ్లిన మౌనిక కళ్ళ ముందే కొడుకు చనిపోవడంతో.. గుండెలు పగిలేలా ఏడ్చింది. బాటిల్ మూత గొంతులు ఇరుక్కోవడంతో చనిపోయిన కుమారుడు రక్షిత్ రామ్ ను చూసి కన్నీరు మున్నిరవుతున్నారు కుటుంబసభ్యులు. తల్లిదండ్రులనున ఓదార్చడం కుటుంబ సభ్యుల తరం కాలేదు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి
Also read
- శీర్షాసనంలో శివయ్య..!
- హైదరాబాద్ నారాయణ కాలేజీలో దారుణం
- Sattenapalle: అప్పు వివాదం.. తల్లీ కుమారుడి ఆత్మహత్య
- Kadapa: జైల్లో దస్తగిరికి బెదిరింపులు.. మరోసారి విచారణ చేపట్టిన కర్నూలు ఎస్పీ
- Gollaprollu: బాకీ తీరుస్తానంటూ బావిలోకి తోశాడు