అంతర్వేది తీరంలో సముద్రం సయ్యాట ఆడుతోంది. ఎప్పుడూ.. అలలతో ఉవ్వెత్తున ఎగసిపడుతూ ఉండే సముద్రం ఉన్నట్లుండి 500 మీటర్లు వెనక్కి వెళ్లింది. దీంతో స్థానికులు ఆశ్చర్యపోవడంతోపాటు.. భయాందోళన వ్యక్తచేస్తున్నారు. అంతర్వేదిలో సముద్ర తీరంలో ఉన్నట్టుండి నీళ్లు.. 500 మీటర్లు వెనక్కి వెళ్లింది.
అంతర్వేది తీరంలో సముద్రం సయ్యాట ఆడుతోంది. ఎప్పుడూ.. అలలతో ఉవ్వెత్తున ఎగసిపడుతూ ఉండే సముద్రం ఉన్నట్లుండి 500 మీటర్లు వెనక్కి వెళ్లింది. దీంతో స్థానికులు ఆశ్చర్యపోవడంతోపాటు.. భయాందోళన వ్యక్తచేస్తున్నారు. అంతర్వేదిలో సముద్ర తీరంలో ఉన్నట్టుండి నీళ్లు.. 500 మీటర్లు వెనక్కి వెళ్లింది. దీంతో సముద్ర తీరమంతా మోకాళ్ళ లోతు ఒండ్రు మట్టితో ఎడారిగా మారింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా, సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో సముద్రం తీరం భారీగా వెనక్కి వెళ్లడంతో.. అక్కడ నిర్మానుష్యంగా మారింది.. దీంతో ఏం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
అంతర్వేది తీర ప్రాంతమంతా మోకాళ్ళ లోతు ఒండ్రు మట్టితో నిండి పోవడంతో.. సముద్ర స్నానానికి వెళ్లాలంటేనే పర్యాటకులు, భక్తులు భయపడుతున్నారు. మునుపెన్నడు ఇటువంటి పరిస్థితి అంతర్వేది తీరంలో ఏర్పడలేదని.. సునామి వచ్చే సూచనలు ఉన్నప్పుడే ఇటువంటి పరిస్థితులు ఏర్పడతాయని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.. ఎడారిని తలపించే విధంగా విశాలంగా ఉండే సముద్రం అకస్మాత్తుగా వెనక్కి వెళ్లిపోవడంతో ఏం జరుగుతుందో అన్న భయాందోళన వ్యక్తమవుతోంది.
వీడియో చూడండి
కాగా.. గతంలోనూ ఇసుక మేటలు వేసి కొన్ని మీటర్ల మేర సముద్రం వెనక్కి వెళ్లినట్లు పేర్కొంటున్నారు. ఇప్పుడు ఒండ్రు మట్టి ముందుకు వచ్చి సముద్రం వెనక్కి వెళ్లడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళనలో ఉన్నారు.
Also read
- చెంబులో ‘కీ’… అదే కలిసొచ్చింది దొంగలకి
- ఫేస్ బుక్ లో వల.. సహజీవనం తర్వాత అసలు రంగు!
- భర్త కువైట్‌లో.. భార్య కడపలో.. డ్రైవర్‌తో అలా కనిపించే సరికి..
- విశాఖ ప్రమాద బాధితులకు కోటిరూపాయల పరిహారం ఇవ్వాలి…… గ్రీష్మ కుమార్ ఐ.యఫ్.టీ.యు రాష్ట్ర కమిటీ సభ్యులు.
- భార్యభర్త మధ్యలో ప్రియుడు.. ఆయన లేడని ఇంటికి పిలిచింది.. తర్వాతి సీన్ ఇదే..





