SGSTV NEWS
Andhra PradeshCrime

ఏడాదిలోపే రెండో బిడ్డను విక్రయించిన తల్లి.. డబ్బుల పంపకంలో తేడా రావడంతో..




కన్నబిడ్డలనే కూరగాయలు అమ్మినట్లు అమ్మేస్తుంది. ఆనక కొనుగోలు చేసిన వారితో గొడవ పడుతుంది. చివరకూ పోలీసుల వద్దకు చేరి పంచాయితీ పెడుతుంది. ఈ కన్న తల్లి వ్యవహరం వివాదాస్పదంగా మారడంతో పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. వివరాల ప్రకారం.. బాపట్లలోని ఇందిరా నగర్ కాలనీకి చెందిన వెంకటేశ్వరమ్మ ఒక వ్యక్తితో సహజీవనం చేస్తోంది.


కన్నబిడ్డలనే కూరగాయలు అమ్మినట్లు అమ్మేస్తుంది. ఆనక కొనుగోలు చేసిన వారితో గొడవ పడుతుంది. చివరకూ పోలీసుల వద్దకు చేరి పంచాయితీ పెడుతుంది. ఈ కన్న తల్లి వ్యవహరం వివాదాస్పదంగా మారడంతో పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. వివరాల ప్రకారం.. బాపట్లలోని ఇందిరా నగర్ కాలనీకి చెందిన వెంకటేశ్వరమ్మ ఒక వ్యక్తితో సహజీవనం చేస్తోంది. వీరికి రెడు నెలల కిందట ఒక పాప పుట్టింది. అయితే ఆ పాపను లక్షన్నర రూపాయలకు క్రిష్ణా జిల్లా కోడూరుకు చెందిన అద్దెపల్లి గీతకు విక్రయించారు. గీతకు పిల్లలు లేకపోవడంతో బిడ్డను కొనుగోలు చేసింది. అయితే వెంకటేశ్వరమ్మ వద్ద నుండి గీత వద్దకు పాప చేరడానికి నలుగురైదుగురు మద్యవర్తులు పనిచేశారు. లక్షన్నర రూపాయలకు వెంకటేశ్వరమ్మ ఒప్పుకొని బిడ్డను ఇస్తే ఆమెకు అరవై వేల రూపాయలు మాత్రమే దక్కింది.


దీంతో ఆమె మధ్యవర్తులతో గొడవకు దిగింది. అంతేకాకుండా బిడ్డను కొనుగోలు చేసిన గీతతోనూ ఘర్షణ పడింది. ఆ తర్వాత తన బిడ్డ సంగతి తేల్చాలంటూ రేపల్లే పోలీసులను ఆశ్రయించింది. రంగంలోని దిగిన పోలీసులు పాపను తీసుకొని బాపట్ల జిల్లా అధికారులకు సమాచారం ఇచ్చారు. పాపను బాల సదన్ కు చేర్చారు. వెంకటేశ్వరమ్మను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

పాపను విక్రయించే క్రమంలో బాపట్లకు చెందిన నూర్, జానీ, నగరం మండలం ప్రజ్నంకు చెందిన ఏడుకొండలు, అవనిగడ్డకు చెందిన లక్స్మీ మధ్యవర్తులుగా వ్యవహరించినట్లు పోలీసులకు విచారణలో తేలింది. వీరంతా తొంభై వేల రూపాయలు పంచుకొని అరవై వేల రూపాయలను మాత్రం వెంకటేశ్వరమ్మకు ఇచ్చారు. దీంతో వెంకటేశ్వరమ్మ వారితో ఘర్షణ పడినట్లు గుర్తించారు.


అయితే.. వెంకటేశ్వరమ్మ గత ఏడాది అక్టోబర్ సమయంలోనే ఇదే విధంగా తన మొదటి బిడ్డ బాబును నెల్లూరు జిల్లా కావలికి చెందిన దంపతులకు విక్రయించింది. రెండు నెలల తర్వాత తన బిడ్డను తనకు ఇవ్వాలంటూ వారితో గొడవ పడటమే కాకుండా పోలీసులకు ఫిర్యాదు చేసింది.

పోలీసులు దర్యాప్తులో మగ బిడ్డను వెంకటేశ్వరమ్మే విక్రయించినట్లు గుర్తించారు. అప్పుడు కేసు నమోదు చేసిన పోలీసులు కొంతకాలం తర్వాత మగ బిడ్డను వెంకటేశ్వరమ్మకే ఇచ్చేశారు. ఆ బిడ్డ ప్రస్తుతం ఆమె సహజీవనం చేస్తున్న వ్యక్తి వద్దే ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది.

అయితే వెంకటేశ్వరమ్మ ఎందుకు శిశువులను విక్రయిస్తుందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బిడ్డలను కన్న రెండు నెలల్లోపే విక్రయించడంపై ఆరా తీస్తున్నారు. వీరికి సహకరించిన వారందరిపై కేసులు నమోదు చేసేందుకు బాపట్ల పోలీసులు సిద్దమయ్యారు.

Also read

Related posts

Share this