అది విశాఖలోని పేరు మోసిన హోటల్. అందులో రూమ్ నెంబర్ 229. ఓ ఎన్నారై డాక్టర్ గది అద్దెకు తీసుకున్నాడు. అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్న ఆ వివాహిత విశాఖ వచ్చారు. ఎన్నారై డాక్టర్‌ను కలిసేందుకు అతను ఉంటున్న గదిలోకి వెళ్లారు.. కట్ చేస్తే.. వాష్ రూమ్‌లో ఎన్నారై సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మహిళ అనుమానాస్పద స్థితిలో ప్రాణాల కోల్పోయింది.
విశాఖ సీతమ్మధార ప్రాంతానికి చెందిన రోజా.. అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నారు. ఆమెకు భర్త, ఇద్దరు పిల్లలు. అక్కడే స్థిరపడ్డారు. అయితే విశాఖకు చెందిన శ్రీధర్ అనే డాక్టర్ కూడా అమెరికాలో పని చేస్తున్నాడు. రోజాకు డాక్టర్ శ్రీధర్ స్నేహితుడు. అయితే ఇటీవల విశాఖకు వచ్చిన శ్రీధర్.. ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రాంతంలోని ఓ స్టార్ హోటల్ గదిని అద్దెకు తీసుకున్నాడు. రూమ్ నెంబర్ 229లో ఉంటున్నాడు. అయితే అమెరికా నుంచి విశాఖ వచ్చిన ఎన్ఆర్ఐ మహిళా సాఫ్ట్ వేర్ ఇంజనీర్.. వైద్యుణ్ని కలిసేందుకు హోటల్‌కు వెళ్లారు. అక్కడ గదిలో ఉన్న డాక్టర్‌ను కలిశారు. ఆ తర్వాత వాష్ రూమ్ లోపలికి వెళ్లిన ఆ మహిళ ఎంతకు బయటకు రాలేదు. దీంతో ఆ డాక్టర్ హోటల్ యాజమాన్యానికి సమాచారం ఇచ్చాడు. వెళ్లి చూసేసరికి వాష్ రూమ్‌లోనే షవర్‌కు చున్నీతో ఉరివేసుకున్నట్టు వేలాడుతూ కనిపించారు రోజా.
హోటల్ మేనేజర్ త్రీ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రాథమికంగా గుర్తించామన్నారు సిపి బాగ్చి. ఆరో తేదీ మధ్యాహ్నం 3:35 గంటలకు ఈ ఘటన జరిగిందని త్రీ టౌన్ పోలీసుల ప్రకటన విడుదల చేశారు. కేసు దర్యాప్తులో ఉందని.. రోజా మృతికి కారణాలు దర్యాప్తులో తేలుతాయని ప్రకటించారు పోలీసులు. అయితే మృతురాలి కుటుంబ సభ్యుల వినతి మేరకు వివరాలను గోప్యంగా ఉంచారు పోలీసులు. డాక్టర్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
ఎన్నారై మహిళ రోజా.. స్నేహితుడు ఉంటున్న గదిలో ఎందుకు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు..? ఆత్మహత్య చేసుకున్నారా లేక మరే ఇతర కారణముందా..? ఆత్మహత్య చేసుకుంటే దానికి గల కారణం ఏంటి..? లేకపోతే ఆమె మరణానికి అసలు కారణం ఏంటి అనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. అమెరికాలో ఉంటున్న రోజా.. స్నేహితుడిని కలిసేందుకు విశాఖ వచ్చి ఆ గదికి ఎందుకు వెళ్లారు..? అక్కడ ఇద్దర మధ్య ఏం జరిగింది..? ఎన్నారై మహిళా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ రోజా ప్రాణాలు ఎందుకు పోయాయి అన్నది ఇప్పుడు విచారణలో తేలాల్సి ఉంది
Also read
- BJP Leader love case: నవ వధువును ఎత్తుకెళ్లిన బీజేపీ నేత.. చెప్పుల దండేసి ఊరేగించిన స్థానికులు!
- AP Crime: ఏపీలో ఘోర విషాదం.. ఇద్దరు విద్యార్థుల ప్రాణం తీసిన ఈత సరదా..
- AP News: గురుకులంలో 12 మంది విద్యార్థులకు అస్వస్థత
- Dog bite: కుక్క కరిచిందని గొంతు కోసుకున్న వ్యక్తి.. ఆపరేషన్ థియేటర్లో ఏరులై పారిన నెత్తురు!
- Online Betting: ఆన్లైన్ గేమ్ మోసానికి 17 ఏళ్ల బాలుడు బలి.. ఫోన్‌కు ఫోరెన్సిక్ పరీక్ష!