ప్రియురాలి వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు ప్రియుడు. ఇక అతడి మరణం తట్టుకోలేక తాను కూడా ఆత్మహత్యాయత్నం చేసి మూడు రోజులుగా మృత్యువుతో పోరాడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రియురాలు కూడా మృతి చెందిన ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. ఆ వివరాలు ఇలా..
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం గువ్వలదొడ్డిలో చోటు చేసుకుంది. వివాహానికి ముందే ధనుంజయ గౌడ్(27) అనే యువకుడు అదే గ్రామానికి చెందిన తన కంటే పెద్ద అయిన శశికలతో ప్రేమలో పడ్డారు. అయితే పెద్దలు అంగీకరించకపోవడంతో ఇద్దరూ వేరేవారితో పెళ్లిళ్లు చేసుకుని జీవనం సాగించారు. అయితే పెళ్లి అయిన తరువాత కూడా వారి మధ్య వివాహేతర బంధం కొనసాగడం, ఇద్దరు గ్రామాన్ని వదిలి కొద్ది రోజులు వెళ్లిపోవడంతో ధనుంజయ గౌడ్ భార్య.. భర్తతో గొడవపడి పుట్టింటికి వెళ్ళిపోయింది. ఆ తరువాత కూడా వీరిద్దరి మధ్య వివాహేతర బంధం కొనసాగడమే కాకుండా ప్రియురాలు శశికళ తన భర్త, ఇద్దరు పిల్లలను వదిలేసి ప్రియుడితో గ్రామాన్ని వదిలి ఎమ్మిగనూరుకు వచ్చేసింది.
ఎమ్మిగనూరులో మెడికల్ షాప్ పెట్టుకున్న ధనుంజయ గౌడ్ ప్రియురాలిని ఓ లేడీస్ హాస్టల్‌లో చేర్చి తమ బంధాన్ని కొనసాగించాడు. అయితే హాస్టల్‌లో ఉండలేకపోతున్నానని, పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకువెళ్ళాలని ప్రియురాలు నిత్యం ఒత్తిడి పెంచింది. ప్రియుడు కాలయాపన చేస్తుండటంతో ఆదివారం ప్రియురాలు తాను ఉంటున్న హాస్టల్‌లో మెడకు ఉరిని బిగించుకుని తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సెల్ఫీ ఫోటోను ధనుంజయ గౌడ్‌కు పంపింది. ఆమె చనిపోతే తనపై కేసు నమోదై జైలుకు వెళ్ళాల్సి వస్తుందని భయపడ్డ ధనుంజయ గౌడ్ గ్రామంలోని పొలంలోకి వెళ్లి పురుగులు మందు తాగాడు. పొలం పక్కన ఉన్న రైతులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే చికిత్స నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరిలించారు. అయితే చికిత్స పొందుతూ ధనుంజయ గౌడ్ రాత్రి మృతి చెందాడు. శశికల నిత్యం వేధింపులు చేస్తుండడంతోనే తమ కుమారుడు మరణించాడని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అయితే ప్రియుడు ధనుంజయ గౌడ్ మరణం తట్టుకోలేక తాను కూడా ప్రియుడి దగ్గరికి వెళ్లాలని ధనుంజయ్ మరణించిన మరుసటిరోజే ప్రియురాలు శశికల పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. చికిత్స నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని తెలపడంతో మెరుగైన చికిత్స కోసం కర్నూలు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తెల్లవారుజామున శశికళ మృతి చెందింది. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి
Also read
- Job Astrology: గ్రహాల అనుకూలత.. ఈ రాశులకు పదోన్నతి, అధికార యోగాలు..!
- దీపావళి రోజున ఈ రాశుల జీవితాల్లో దీపాల వెలుగులు.. త్రిగ్రహి యోగంతో అపార సంపద
- TG Crime: జనగామ జైలులో కలకలం.. బ్లీచింగ్ పౌడర్ నీళ్లు తాగి రిమాండ్ ఖైదీ సూ**సైడ్.. కారణం ఇదేనా?
- Khammam : వీడు టీచర్ కాదు టార్చర్.. అబ్బాయిపై లైంగిక వేధింపులు.. రోజు రాత్రంతా!
- Dialysis: డయాలసిస్ కేంద్రాలకు వెళ్ళే వారికి కొత్తరోగాలు.. రాష్ట్రంలో షాకింగ్ ఘటనలు!