SGSTV NEWS
Andhra PradeshCrime

Andhra: అచ్చం గీతాగోవిందం మూవీ లాంటి సీన్ – ఈ విద్యార్థిని గురువుకు ఎలా పంగనామాలు పెట్టిందంటే



అనంతపురంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్‌ సతీష్‌ను తన స్టూడెంట్ ఒక అమ్మాయి… బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి బ్లాక్‌మెయిల్ చేసి లక్షన్నర రూపాయలు వసూలు చేసిన ఘటన వెలుగుచూసింది. మానసికంగా కుంగిపోయిన సతీష్ ఆత్మహత్యకు సిద్ధమవుతుండగా… స్నేహితుల సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇద్దరూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.

అనంతపురం పట్టణంలోని ఒక ప్రైవేటు కళాశాలలో లెక్చరర్‌కు… విద్యార్థినికి మధ్య జరిగిన సంఘటన… గురుదక్షిణ ఇచ్చే రోజులు పోయి… గురువు దగ్గరే బ్లాక్ మెయిల్ చేసి దక్షిణ తీసుకునే రోజులు వచ్చాయా అనిపిస్తుంది… ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉందని చదువుకునేందుకు సాయం చేసిన సార్‌ని… బాయ్ ఫ్రెండ్‌తో కలిసి ఓ విద్యార్థిని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు గుంజడం ప్రారంభించింది. అలా పదేపదే బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు అడగడంతో ఏకంగా ఆ మాస్టర్ ఆత్మహత్య చేసుకున్నందుకు కూడా రెడీ అయ్యారు.. అనంతపురంలోని ఓ ప్రైవేటు కళాశాలలో లెక్చరర్‌గా పనిచేసే సతీష్… అదే కళాశాలలో చదివే విద్యార్థిని ఆర్థికంగా ఇబ్బందులు ఉండటం చూసి.. చదువుకునేందుకు లెక్చరర్ సతీష్ అడపా దడపా డబ్బు సాయం చేసేవారు. ఇలా చిల్లర సాయం పొందడం ఎందుకు అనుకుందో ఏమో ఆ విద్యార్థిని… ఈ వ్యవహారాన్ని క్లైమాక్స్‌కు తీసుకురావాలనుకుని… బాయ్ ఫ్రెండ్‌తొో ఆయన్ని బ్లాక్ మెయిల్ చేయాలని డిసైడయ్యింది.

విద్యార్థిని.. బాయ్ ఫ్రెండ్ లెక్చరర్‌కు ఫోన్ చేసి… అమ్మాయితో అసభ్యంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారని… లైంగికంగా ఎందుకు వేధిస్తున్నారని బెదిరించాడు… ఫోన్ కాన్ఫరెన్స్‌లోకి విద్యార్థిని కూడా తీసుకొని ముగ్గురు మాట్లాడిన సంభాషణలను ఫోన్ రికార్డ్ చేశారు. అనంతరం ఫోన్ రికార్డ్ సంభాషణను వాడుకుని రచ్చకీడుస్తామని బెదిరించి.. లెక్చరర్ సతీష్ దగ్గర విడతల వారీగా లక్షన్నర డబ్బులు వసూలు చేశారు. పదేపదే డబ్బులు కావాలని బెదిరిస్తూ ఉండడంతో భరించలేని లెక్చరర్ సతీష్ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. ఆయన తన బాధను స్నేహితులకు చెప్పడంతో.. వారు బ్రెయిన్ వాష్ చేశారు. తప్పు చేయనప్పుడు భయపడటం ఎందుకు పోలీసులకు ఫిర్యాదు చేద్దామన్నారు. విషయం అంతా పోలీసులకు చెప్పి పక్కాగా రెడ్ హ్యాండెడ్‌గా శిష్యురాతితో పాటు ఆమె బాయ్‌ఫ్రెండ్‌ను పట్టించేందుకు పూనుకున్నారు.  అడిగిన డబ్బు ఇస్తామని వారిని పిలిపించి… డబ్బులు ఇచ్చారు… అక్కడే మఫ్టీలో ఉన్న పోలీసులు.. సార్ గారి శిష్యురాలని, ఆమె బాయ్ ఫ్రెండ్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. గురువుకే పంగనామాలు పెట్టి.. బ్లాక్‌మెయిల్ చేసి డబ్బులు గుంజిన శిష్యురాలని ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు

Also read

Related posts

Share this