కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో తమ సమస్యలను పరిష్కరించాలని మాల బేగరిలీలు వినూత్న నిరసనకు దిగారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న మాల బేగరీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహా గర్జన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా మనిషి పుర్రెలు, ఎముకలతో పాటు స్మశాన వాటికలో బేగరులు ఉపయోగించే పని ముట్లను చేత పట్టుకొని వినూత్న రీతిలో నిరసన తెలుపుతూ నినాదాలు చేశారు. ప్రభుత్వం వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో తమ సమస్యలను పరిష్కరించాలని మాల బేగరిలీలు వినూత్న నిరసనకు దిగారు. మనిషి పుర్రెలు, ఎముకలతో పాటు స్మశాన వాటికలో బేగరులు ఉపయోగించే పని ముట్లను చేత పట్టుకొని వినూత్న రీతిలో నిరసన తెలుపుతూ నినాదాలు చేశారు. ప్రభుత్వం వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాల బేగరుల సంఘం నాయకుడు మాల రంగన్న మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా గ్రామాల్లో, పట్టణాల్లో, మాల బేగరులు తమ వృత్తి ను నమ్ముకొని జీవనం చేస్తున్నారన్నారు.ఎన్నో వ్యాధులతో, ప్రమాదాలతో మరణించిన వారిని స్మశాన వాటికలో గుంతలు తీస్తూ శవాలను ముట్టుకొని బేగరుల వృత్తిని నిర్వహిస్తున్నారన్నారు.
చాలామంది బేగరులు అనారోగ్య పాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని ఏళ్లయినా బేగరుల తలరాత మాత్రం మారడం లేదన్నారు. కర్నూలు జిల్లాలో 35వేల మాల బేగరుల కుటుంబాలు ఉన్నాయని వారందరిని గుర్తించి ప్రభుత్వం ఆదుకోవాలని, వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా అయినా గుర్తించి కనీస గౌరవ వేతనం ఇవ్వాలని, అలాగే డప్పు కళాకారులకు,చెప్పులు కొట్టుకునే,వారికి ఇస్తున్న పింఛన్లు మాదిరి మాల బేగరులకు కూడా పింఛన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు
Also read
- శీర్షాసనంలో శివయ్య..!
- హైదరాబాద్ నారాయణ కాలేజీలో దారుణం
- Sattenapalle: అప్పు వివాదం.. తల్లీ కుమారుడి ఆత్మహత్య
- Kadapa: జైల్లో దస్తగిరికి బెదిరింపులు.. మరోసారి విచారణ చేపట్టిన కర్నూలు ఎస్పీ
- Gollaprollu: బాకీ తీరుస్తానంటూ బావిలోకి తోశాడు