SGSTV NEWS
Andhra PradeshCrime

Kadapa Minor Girl Rape: ఏపీలో దారుణం.. బాలికపై రేప్ – షాకింగ్ వీడియో


కడప జిల్లా వేంపల్లి మండలం చింతలమడుగుపల్లికి చెందిన మైనర్ బాలికపై రేప్ జరిగింది. గొర్రెలు మేపుకునేందుకు కొండల్లోకి వెళ్లగా.. అక్కడ మద్యం సేవిస్తున్న యువకులు ఆమెపై లైంగిక దాడి చేశారు. వద్దు అని వేడుకున్న ఆ బాలిక వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

ఏపీలో మరోసారి కామాంధులు రెచ్చిపోయారు. మైనర్ బాలికను రేప్ చేశారు. గొర్రెలు మేపుకునేందుకు వెళ్లిన ఆ చిన్నారి జీవితాన్ని చిదిమేశారు. తాగిన మైకంలో ఆమె బట్టలు చించేశారు. వద్దూ వద్దూ అని వేడుకున్నా ఆ తాగుబోతు కామాందులు వదలిపెట్టలేదు. ఆ సమయంలో ఆమె ఎంతగానో వారిని వేడుకుంది. ఇప్పుడు అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన కడప జిల్లాలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

Kadapa Minor Girl Raped
కడప జిల్లా వేంపల్లి మండలం చింతలమడుగుపల్లికి చెందిన మైనర్ బాలిక గొర్రెలు మేపుకునేందుకు కొండల్లోకి వెళ్లింది. అదే సమయంలో అక్కడ నలుగురు యువకులు మద్యం సేవిస్తుండగా.. ఆ చిన్నారి వారి కంటపడింది. దీంతో ఆ యువకులు ఆమెను వేధించడం మొదలు పెట్టారు. ఆమె ఎంతగానో వారిని వేడుకుంది. బలవంత పెట్టొద్దంటూ వారికి దండం పెట్టింది.

వద్దు వద్దు అని ఎంతగానో మొరపెటుకున్నా ఆ కామాంధులు ఆగలేదు. ఆమెపై లైంగిక దాడి చేశారు. ప్రస్తుతం ఆ బాలిక వేడుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆపై బాలికపై లైంగికదాడి జరిగిందంటూ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం బాలికను కడప రిమ్స్ కు తరలించారు. అదే సమయంలో గ్రామస్తులు ఆగ్రహంతో వేంపల్లి పీఎస్‌పై దాడికి దిగారు. సకాలంలో పోలీసులు స్పందించలేదంటూ ఆరోపణలు రావడంతో ఆ ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Also read

Related posts

Share this