SGSTV NEWS
Andhra PradeshCrime

ఉపాధి కోసం కువైట్ వెళ్తానన్న భార్య.. వద్దన్న భర్త ఏం చేశాడో తెలుసా?

 

అన్నమయ్య జిల్లాలో ఘోరం జరిగింది. కె.వి పల్లి మండలం మారెళ్ళలో వివాహిత దారుణ హత్యకు గురైంది. భర్త రమణ చేతిలో 38 ఏళ్ల యశోదన హత్యకు గురైంది. సుండుపల్లి మండలం వీరబల్లికి చెందిన యశోదకు కె.వి పల్లి మండలం మారెళ్ళ ఎస్సీ కాలనీకి చెందిన రమణతో 22 ఏళ్ల క్రితం పెళ్లి అయింది. కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్న యశోద-రమణ దంపతులకు ఇద్దరు పిల్లలు.

అన్నమయ్య జిల్లాలో ఘోరం జరిగింది. కె.వి పల్లి మండలం మారెళ్ళలో వివాహిత దారుణ హత్యకు గురైంది. భర్త రమణ చేతిలో 38 ఏళ్ల యశోదన హత్యకు గురైంది. సుండుపల్లి మండలం వీరబల్లికి చెందిన యశోదకు కె.వి పల్లి మండలం మారెళ్ళ ఎస్సీ కాలనీకి చెందిన రమణతో 22 ఏళ్ల క్రితం పెళ్లి అయింది. కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్న యశోద-రమణ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉండగా, మూడేళ్ల క్రితం ఉపాధి కోసం యశోద కువైట్‌కు వెళ్ళింది.

నెల రోజుల క్రితం సొంతూరు కు వచ్చిన యశోద తిరిగి కువైట్ వెళ్లేందుకు ప్రయత్నం చేసింది. ఈ మధ్యనే నిర్మించుకున్న కొత్త ఇంటి గృహప్రవేశం పూర్తి కాగా యశోద తిరిగి పూర్తి కువైట్ కి వెళ్లేందుకు ప్రయత్నించింది. పిల్లలు పెద్దవాళ్లు అవుతుండడంతో మరింత ఆర్థికంగా బలపడేందుకు కువైట్ వెళ్లాలని నిర్ణయించుకున్న యశోద తీరు భర్తకు నచ్చలేదు. భార్య కువైట్ వెళ్లేందుకు ఇష్టపడని భర్త రమణకు గత కొన్ని రోజులుగా గొడవ పడుతూ వచ్చాడు.

ఈ క్రమంలోనే భార్య యశోద పై అనుమానం కూడా ఎక్కువ కావడంతో కర్రతో కొట్టి చంపాడు భర్త రమణ. భార్య ప్రవర్తన పట్ల అనుమానమే హత్యకు కారణమని భావిస్తున్నారు పోలీసులు. ఉపాధి కోసం కువైట్ కి వెళ్లి నెల రోజుల క్రితం వచ్చిన యశోద తిరిగి కువైట్ వెళ్లేందుకు ప్రయత్నం చేయడంతోనే హత్య జరిగినట్లు అనుమనిస్తున్నారు. భార్య యశోద కువైట్ వెళ్లేందుకు అంగీకరించని భర్త రమణ దారుణానికి పాల్పడినట్లు భావిస్తున్నారు. నిద్రిస్తున్న భార్య యశోద తలపై కర్రతో కొట్టి చంపిన భర్త రమణ భార్య చనిపోయిందని నిర్ధారించుకున్నాక కేవీ పల్లి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. ఈ మేరకు భర్త రమణను అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు కేవీ పల్లి పోలీసులు

Also read

Related posts