March 16, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

Palnadu: 100 గ్రాముల బిస్కెట్ 6 లక్షలకే.. లచ్చలు.. లచ్చలు ఇచ్చేశారు.. కట్ చేస్తే..



బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. త్వరలో తులం లక్ష కొట్టే సూచనలు కనిపస్తున్నాయి. దీంతో తక్కువ ధరకే బంగారం ఇస్తామంటే చాలామంది అట్రాక్ట్ అవుతున్నారు. ప్రజల్లో ఈ బలహీనతనే క్యాష్ చేసుకునేందుకు ఈ వ్యాపారి విసిరన వలలో అనేక మంది చిక్కుకుని విలవిలలాడుతున్నారు.


పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చెందిన పెరుమాళ్ల రాజేష్ మిర్చి వ్యాపారం చేసేవాడు. అందులో బాగానే సంపాదించాడన్న పేరుగాంచాడు. ఈ తర్వాత బంగారం దిగుమతి చేసుకునే వ్యాపారంలో కూడా దిగాడు. అయితే గత కొంతకాలంగా బంగారం ధరలు పెరగిపోతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే తక్కువ ధరకు బంగారు బిస్కెట్లు ఇస్తున్నట్లు ప్రచారం చేశాడు. 100 గ్రాములున్న బిస్కెట్‌ను ఆరు లక్షల నుంచి ఏడు లక్షలకే ఇస్తున్నట్లు చెప్పాడు. ఆరు నెలల్లో బిస్కెట్ ఇవ్వలేకపోతే ఆరు శాతం వడ్డీతో డబ్బులు తిరిగి ఇస్తానని చెప్పాడు. ప్రస్తుతం మార్కెట్‌లో బంగారు బిస్కెట్ తొమ్మిది లక్షల వరకూ ధర పలుకుతోంది. అదే సమయంలో ఆరు నుండి ఏడు లక్షల రూపాయలకే బంగారు బిస్కెట్ ఇస్తాననటంతో చాలామంది అట్రాక్ట్ అయ్యారు. అదే విధంగా కొంతమంది వద్ద నుండి డబ్బులు తీసుకొని వారికి బిస్కెట్లు కూడా ఇచ్చాడు.


దీంతో పల్నాడులోని నర్సరావుపేట, సత్తెనపల్లి, జానపాడు, కారంపూడి ప్రాంతాలకు చెందిన అనేక మంది రాజేష్‌కు డబ్బులిచ్చారు. కొద్ది కాలంపాటు అంతా బాగానే ఉన్నట్లు కనిపించింది. అయితే కొద్ది రోజుల నుండి రాజేష్ పిడుగురాల్లో కనిపించడం లేదు. అతని కుటుంబ సభ్యులు కూడా కనిపించకపోవడం… ఫోన్ల అంటెడ్ చేయకపోవడంతో డబ్బులిచ్చిన వారిలో ఆందోళన మొదలైంది. దీంతో ఎవరికి వారే రాజేష్‌కి ఫోన్ చేసి బంగారు బిస్కెట్ ఎప్పుడిస్తావంటూ అడగటం మొదలు పెట్టారు. అదే సమయంలో రాజేష్ పారిపోయినట్లు ప్రచారం జరగడంతో అందరూ అతని కోసం వెదుకులాట ప్రారంభించారు. ప్రస్తుతం రాజేష్ ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు. ఫోన్ చేస్తే త్వరలోనే అందరికి డబ్బులు సర్దుబాటు చేస్తానంటూ చెప్పుకొస్తున్నాడు. అయితే తాము డబ్బులిచ్చిన విషయం ఎవరికి చెప్పాలో అర్ధం కాని పరిస్థితుల్లో బాధితులు ఉండిపోయారు. పోలీసులకు ఫిర్యాదు చేయాలనుకున్నా ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో మరింతగా బాధితుల్లో ఆవేదన వ్యక్తం అవుతోంది. వంద కోట్లకు పైగా రాజేష్ వసూలు చేసినట్లు పల్నాడులో వార్త చక్కెర్లు కొడుతోంది. పోలీసులు ఇప్పటికైనా జోక్యం చేసుకుంటారా లేదా అన్న అంశంలో ఇప్పటి వరకూ స్పష్టత లేదు

Also read

Related posts

Share via