April 19, 2025
SGSTV NEWS
Andhra PradeshCrimeViral

పల్నాడు: పోలీస్ స్టేషన్ గేటుకు బేడీలు.. పల్నాడులో చిత్ర విచిత్రాలు



ముద్దాయిలకు పోలీసులు బేడీలు వేయడాన్ని సాధారణంగా చూస్తుంటాం. శిక్ష పడిన ఖైదీలను తరలించేటప్పుడు వారు పారిపోకుండా పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. ఇందులో భాగంగానే చేతులకు బేడీలు వేస్తుంటారు. అయితే ఖైదీల చేతులకు ఉండాల్సిన బేడీలు పోలీస్ గేటుకు ఉండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


పల్నాడు జిల్లా దాచేపల్లి పోలీసులు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త పాలేటి క్రిష్ణవేణిని అదుపులోకి తీసుకున్నారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడి మనవడి పెళ్లిలో మంద కృష్ణ మాదిగను అవమానం అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని టిడిపి నేతలు ఇచ్చిన ఫిర్యాదుపై రాత్రి కృష్ణవేణిని అదుపులోకి తీసుకుని దాచేపల్లి స్టేషన్ కు తరలించారు. ఈవిషయం తెలుసుకున్న వైసిపి నేతలు, న్యాయవాదులు ఈ రోజు ఉదయం స్టేషన్ కు వెళ్ళారు.

అయితే వారు వెళ్ళినప్పుడు స్టేషన్ గేటు మూసి ఉంది. గేటు మూసి వేయడమే కాకుండా గేటుకు తాళాలు బదులు బేడీలు వేసి ఉంచారు. దీంతో వైసిపి నేతలు, న్యాయవాదులు ఆశ్చర్య పోయారు.‌ నిందితులకు వేయాల్సిన బేడీలను గేటుకు ఎలా చేస్తారంటూ పోలీసులను ప్రశ్నించారు.

ఈ ఘటనపై వైసిపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళను రాత్రి సమయంలో స్టేషనులో ఉంచడమే కాకుండా గేటు బేడీలు వేయడం సిగ్గు మాలిన చర్య అని వైసిపి డాక్టర్స్ సెల్ అధికార ప్రతినిధి అశోక్ కుమార్ అన్నారు. గేటుకు బేడీలు వేసిన ఘటనతో తలదించుకుంటున్నట్లు మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అన్నారు. బేడీలు వేయడానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పోలీస్ ఉన్నతాధికారులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది.

Also read

Related posts

Share via