గుంటూరులోని గోరీల దొడ్డిలో రాజు అనే వ్యక్తి తన భార్య లక్ష్మీపై అనుమానంతో గొడవపడి కత్తితో దాడి చేసి హత్య చేశాడు. ఆ తర్వాత తానూ గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. కుమార్తె ఫోన్ చేయడంతో పిల్లలు ఇంటికి చేరుకోగా తల్లి రక్తపు మడుగులో మృతి చెందగా, తండ్రి తీవ్రమైన గాయాలతో ఉన్నాడు. రాజును ఆసుపత్రికి తరలించి, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గుంటూరులోని గోరీల దొడ్డికి చెందిన రాజు… మిర్చి యార్డులో హమాలీగా పనిచేస్తుంటాడు. పదిహేనేళ్ల క్రితం రఘురామ్ నగర్‌కు చెందిన లక్ష్మిని ప్రేమించాడు. ఆమెనే పెళ్లి చేసుకుంటానని పంతం పట్టాడు. అయితే ఆమెకు అప్పటికే వివాహం అయింది. మొదటి భర్తతో విబేధాల నేపధ్యంలో విడాకులు తీసుకుంది. అప్పటికే ఆమెకు ఇద్దరు పిల్లలున్నారు. అయినా లక్ష్మిని వివాహం చేసుకునేందుకు రాజు ముందుకొచ్చాడు. వీరిద్దరి పరిచయం కూడా హైదరాబాద్‌లో ఒక ప్రవేటు కంపెనీలో పనిచేస్తుండగా మొదలైంది. రాజును నమ్మిన లక్ష్మి అతన్ని వివాహం చేసుకుంది. అప్పటి నుంచి ఇద్దరూ గుంటూరులోనే ఉంటున్నారు. లక్ష్మి కొడుకు టెక్నీషియన్‌గా పనిచేస్తుండగా.. కుమార్తె అకౌంటెంట్‌గా పనిచేస్తుంది. అయితే కొన్నేళ్లుగా రాజు…. లక్ష్మీ మధ్య విబేధాలు మొదలయ్యాయి.. లక్ష్మీ ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న రాజు ఆమెను తరుచూ కొడుతుండేవాడు. పిల్లలిద్దరూ పని చేస్తుండటంతో రాజు పని మానేశాడు. లక్ష్మిని పనిలోకి వెళ్లకుండా కట్టడి చేశాడు. అయినప్పటికీ అనుమానం తీర లేదు.
శనివారం పిల్లలిద్దరూ పనిలోకి వెళ్లిన తర్వాత లక్ష్మీతో రాజు ఘర్షణ పడ్డాడు. కోపంతో ఆమెపై కత్తితో దాడి చేసి గొంతు కోశాడు. ఆ తర్వాత రాజు కూడా గొంతు కోసుకున్నాడు. అయితే కొద్దిసేపటి తర్వాత కుమార్తె లక్ష్మికి ఫోన్ చేయగా మూలుగులు వినిపించాయి. దీంతో వెంటనే ఆమె తన అన్నకు ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పింది. పిల్లలిద్దరూ ఇంటికి వచ్చే సరికి తల్లిదండ్రులిద్దరూ రక్తపు మడుగులో పడి ఉన్నారు.లక్ష్మి అప్పటికే చనిపోగా, రాజు కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. వెంటనే రాజును ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రాజు జిజిహెచ్ లో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- Andhra News: టీడీపీ నేత హత్య కేసులో కీలక పరిణామం.. పోలీసుల కస్టడీకి నలుగురు కీలక నిందితులు!
- Atmakur: ఏఈ శరభారెడ్డి డ్యూటీకి – ఇంట్లో వాళ్లు పోస్ట్ వెడ్డింగ్ షూట్‌కి – తిరిగి వచ్చేసరికి
- Andhra: వామ్మో.. వాళ్లు అలా వచ్చేది అందుకోసమేనా.. ముగ్గురి ప్రాణాలు తీసిన కిలాడీ ముఠా..
- Vastu Tips: ఇంట్లో వాస్తు దోషమా..! నెగిటివ్ ఎనర్జీ నుంచి ఉపశమనం కోసం ఉప్పుతో ఈ పరిహారాలు చేసి చూడండి..
- నేటి జాతకములు…25 జూన్, 2025