SGSTV NEWS
Andhra PradeshCrime

మూఢనమ్మకంతో ఏడాదిన్నర మనవడిపై పగ పెంచుకున్న నాయనమ్మ.. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి..



గుంటురు జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఇతరులు చెప్పిన మాటలు విని మూడనమ్మకంతో ఓ వృద్దురాలు తన మనవడి చేతిని కాల్చేసింది. ఆ తర్వాత హీటర్‌ పట్టుకోవడంతో బాలుడి చేతు కాలినట్టు క్రియేట్‌ చేసింది. బాలుడి తండ్రి వైద్యులను స్పందించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.


తల్లిదండ్రి ఇద్దరూ కూలీ పనిచేసుకుంటారు. గుంటూరులోని నెహ్రూ నగర్‌లో నివాసం ఉంటారు. వీరికి ఏడాదిన్నర వయస్సున్న కొడుకు ఉన్నాడు. వీరిద్దరూ పనికివెళ్లిన సమయంలో నాయనమ్మే బాలుడి ఆలనా పాలనా చూస్తుంటుంది. అయితే కొద్దీ రోజుల క్రితం బాలుడి తండ్రి ఇంటికి వచ్చేసరికి చిన్నారి చేయి పూర్తిగా కాలిపోయి ఉంది. దీంతో ఏం జరిగిందని తల్లిని అడిగ్గా వాటర్ హీటర్ల పట్టుకోవడంతోనే చేయి కాలిందని నాయనమ్మ చెప్పింది. దీంతో బాలుడిని తీసుకొని తండ్రి హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడ వైద్యులు చికిత్స అందించారు. అయితే చేయి పూర్తిగా కాలిపోవడంతో అంతవరకూ తొలగించాలని వైద్యులు చెప్పారు. దీంతో తండ్రి తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. అంతేకాకుండా వాటర్ హీటర్ పట్టుకున్నట్లు లేదని ఎవరో కాల్చినట్లు ఉందని ఆ తండ్రికి డాక్టర్లు చెప్పారు. వైద్యులు చెప్పిన మాటలతో తండ్రి ఆశ్చర్యపోయాడు. ఏంజరిగిందో అర్ధంకాకా ఇంటి వెళ్లి తల్లిని నిలదీశాడు. అప్పడు ఆమె అసలు విషయం బయటపెట్టింది.


బాలుడి పుట్టిన కొద్ది కాలానికే పెద నాన్న చనిపోయాడు. పెదనాన్న చనిపోవడానికి బాలుడి జాతకమే కారణమని ఎవరో ఆమెకు చెప్పారు. వారి చెప్పుడు మాటలను నాయనమ్మ పూర్తిగా తలకెక్కించుకుంది. అప్పటి నుండి బాలుడిపై కోపం పెంచుకుంది. తల్లిదండ్రులు ఇద్దరూ లేని సమయం చూసి పొయ్యి మంటలపై బాలుడి చేయి ఉంచింది. దీంతో మంటల్లో బాలుడి చేయి కాలింది. అయితే ఈ విషయాన్ని దాచి పెట్టిన నాయనమ్మ వాటర్ హీటర్ పట్టుకోవడంతోనే బాలుడి చేయి కాలిపోయిందని ఆబద్దం ఆడింది.

కాగా హీటర్ పట్టుకోవడం వల్ల ప్రమాదం జరగలేదని, ఎవరో కాల్చినట్టు ఉందని వైద్యులు చెప్పడంతో ఇంటికి వచ్చిన కొడుకు తల్లిని నిలదీయడంతో అసలు విషయాన్ని చెప్పింది. అయితే ఈ విషయాన్ని బయటకు పొక్కకుండా ఈ కుటుంబం జాగ్రత్త పడింది. విషయం బటయకు తెలిసి పోలీస్ కేసు నమోదైతే తల్లి అరెస్ట్ అవుతుందన్న భయంతో ఆమె కుమారుడు ఫిర్యాదు చేయలేదు. ప్రస్తుతం బాలుడికి ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది.

Also read

Related posts

Share this