గ్రామంలో ఆధిపత్య పోరు కుటుంబ సభ్యుల మధ్యే విబేధాలకు కారణమయ్యాయి. చేపల చెరువుల ఏర్పాటు, గుడి నిర్మాణంలో డబ్బులు వసూల్లు ఇద్దరి వ్యక్తుల మధ్య ఆధిపత్య పోరుకు దారి తీశాయి. ఒక వ్యక్తి చేతిలో పదే పదే ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేక ఆ విషయాన్నే కొడుకు చెప్పాడు. తన తండ్రి ఓటమికి బదులు తీర్చుకోవాలనుకున్నాడు. తన తండ్రి చనిపోయిన తర్వాత ప్రత్యర్ధిని హత్య చేసి పోలీసులకు చిక్కాడు…
గుంటూరు జిల్లా అమర్తలూరు మండలం కోరు తాడిపర్రులో జుటూరి తిరుపతిరావు, గండికోట క్రిష్ణమూర్తి మధ్య ఐదేళ్ల క్రితం ఆధిపత్య పోరు మొదలైంది. ఇద్దరి కుటుంబాల మధ్య సంబంధ బాంధవ్యాలున్నాయి. అయినప్పటికీ ఒక కుటుంబంపై మరొక కుటుంబానికి కక్షలు మొదలయ్యాయి. రాములవారి గుడి మేనేజ్‌మెంట్ విషయంలోనూ తిరుపతిరావు, క్రిష్ణమూర్తి ఢీ అంటే ఢీ అంటూ తలపడ్డారు. అయితే తిరుపతిరావే మేనేజ్‌మెంట్ దక్కించుకున్నాడు. చందాలు వసూలు చేయడం దగ్గర నుంచి.. వాటిని ఖర్చు చేసే వరకూ తిరుపతిరావు మాటే చెల్లుబాలు అవుతూ వచ్చింది. ఇక గ్రామానికి చెందిన చేపల చెరువుల విషయంలోనూ తిరుపతిరావే పై చేయి సాధించాడు. దీంతో క్రిష్ణమూర్తి ఈ విషయాలన్నీ కొడుకు సుబ్బారావుకి చెప్పి బాధపడేవాడు. తన బంధువైన తిరుపతిరావు పెత్తనం చేయడం తాము ఎన్ని సార్లు పై చేయి సాధించాలని అనుకున్నా కుదరకపోవడంతో ఆ కుటుంబంపై క్రిష్ణమూర్తి, సుబ్బారావులకు కక్ష పెరిగింది. అయితే కొద్దీ కాలం క్రితం క్రిష్ణమూర్తి చనిపోయాడు. ఇకగ్రామంలో గొడవలు జరుగుతుండటంతో అక్కడ ఉండలేక సుబ్బారావు తెనాలి చేరుకున్నాడు.
తెనాలిలో ఉండగానే భార్యతో గొడవలు జరిగాయి. ఆమె సుబ్బారావును వదిలిపెట్టి వెళ్లిపోయింది. మరొక మహిళను చేరదీసిన సుబ్బారావు ఆమెతో కలిసి జీవిస్తున్నాడు. అయితే కొద్ది రోజుల క్రితం టైఫాయిడ్ జ్వరం బారిన పడిన తిరుపతిరావు గ్రామం నుండి తెనాలిలోని అల్లుడింటికి వైద్యం చేయించుకునేందుకు వచ్చాడు. అదే కాలనీలో సుబ్బారావు కూడా నివసిస్తున్నాడు. తిరుపతిరావు ఒంటరిగా తిరుగుతుండటాన్ని సుబ్బారావు గమనించాడు. తనలో తిరుపతిరావుపై పేరుకుపోయిన కసిని బయటకు తీశాడు. ఎలాగైనా తిరుపతిరావును చంపాలనుకున్నాడు. కొబ్బరి బోండాలు నరికే కత్తిని సేకరించుకొని బైక్‌లో పెట్టుకున్నాడు. ఈ నెల పద్నాలుగో తేదిన ఒంటరిగా తిరుపతిరావు రావటాన్ని గమనించి టిఫిన్ తీసుకుంటున్న తిరుపతిరావుపై విచక్షణా రహితంగా దాడి చేసి చంపేశాడు. సిసి కెమెరాల సాయంతో నిందితున్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు కోర్టు ఎదుట హజరుపరిచారు.
Also read
- తుని ఘటన: టీడీపీ నేత నారాయణరావు మృతదేహం లభ్యం
- Telangana: అయ్యయ్యో.. ఇలా దొరికిపోతారని అనుకోలేదు.. ట్విస్ట్ మామూలుగా లేదుగా.. వీడియో వైరల్..
- పెళ్లి కోసం వచ్చిన వ్యక్తికి ఫుల్‌గా తాగించిన మైనర్లు.. తర్వాత ఏం చేశారో తెలిస్తే.. ఫ్యూజులెగరాల్సిందే
- Andhra: కడుపునొప్పితో మైనర్ బాలిక ఆస్పత్రికి.. ఆ కాసేపటికే..
- విజయవాడలోని ఈ ప్రాంతంలో భయం..భయం.. ఎందుకో తెలిస్తే అవాక్కే..