SGSTV NEWS
Andhra PradeshCrime

Andhra News: ఒకే ఒక్క కాలనీని టార్గెట్ చేసిన దొంగలు.. నిద్ర మత్తు వీడే సరికి కోట్లకు కోట్లే..

గుంటూరులోని విద్యానగర్ ప్రాంతం.. ధనవంతులు నివసించే కాలనీగా పేరుంది. కాలనీలో రెండు అపార్ట్ మెంట్స్ లోని చోరి చేసిన దొంగలు 2.5 కోట్ల రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలు, 2.5 లక్షల రూపాయల నగదు అపహరించుకుపోయారు. విద్యానగర్ లోని సాయి నివాస్ అపార్ట్ మెంట్లో సిద్దాబత్తుని వెంకట చంద్రమోహన్ నివసిస్తున్నారు. ఆయన పెయింట్స్ అండ్ శానిటర్సీ షాపు నిర్వహిస్తున్నారు. అయితే ఆమయన తమ కుమార్తె పెళ్లి కోసం రెండు నెలల క్రితం 1 కేజీ 200 గ్రాముల బంగారు ఆభరణాలను చేయించి ఇంట్లో పెట్టారు. అయితే కుటుంబ సభ్యులతో కలిసి చంద్రమోహన్ బయటకు వెళ్లారు. ఇది గమనించిన దొంగలు ఇద్దరూ మొయిన్ గేట్ పక్కనున్న కిటీకీ గ్రిల్స్ తీయడంతో పాటు మెయిన్ గేట్ ను దొంగతాళం చెవితో ఓపెన్ చేశారు. తర్వాత లోపలకి వెళ్లిన దొంగలు కోటి ఇరవై లక్షల రూపాయల విలువ చేసే ఆభరణాలు, రెండు లక్షల రూపాయల నగదు తీసుకొని వచ్చిన దారినే బైక్ పై వెళ్లిపోయారు. ఆ తర్వాత ఇంటికి వచ్చిన వ్యాపారి చోరి జరిగిందని తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు.


సాయి నివాస్ అపార్ట్ మెంట్ కు దగ్గరలోనే ఉన్న అక్షయ లీలా అపార్ట్ మెంట్ లో మిర్చి వ్యాపారి చిరంజీవి లాల్ నివసిస్తుంటారు. ఆయన తన భార్యతో కలిసి బెడ్ రూంలో నిద్రపోయారు. తెల్లవారి లేచి చూసేసరికి బెడ్ రూంలో ర్యాక్స్ తెరిచి ఉన్నాయి. దీంతో అనుమానం వచ్చిన వ్యాపారి కొడుకును నిద్ర లేపి ఏం జరిగిందో పరిశీలించమన్నారు. ఆ తర్వాత చుట్టు పక్కల ఉన్న సిసి కెమెరాలు పరిశీలించారు. అపార్ట్ మెంట్ పక్కనే ఉన్న నిర్మాణం ప్రాంతం నుండి నిచ్చెన ద్వారా కిటీకికి ఉన్న తీగెలు తొలగించి అపార్ట్ మెంట్లోకి ఒక వ్యక్తి వచ్చినట్లు సిసి కెమెరా విజువల్స్ రికార్డ్ అయింది. దీంతో చోరి జరిగిందని నిర్ధారించుకున్న వ్యాపారి పట్టాభిపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇంట్లోని 1కేజి 300 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు యాభై వేల రూపాయల నగదు పోయినట్లు గుర్తించారు.


రెండు ఘటనల్లో 2.5 కోట్ల రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలు, 2.5 లక్షల రూపాయల నగదు పోవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. డిఎస్సీ అరవింద్ తో పాటు పట్టాభిపుం పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. నిందితుల కోసం ప్రత్యేక బ్రుందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు.

Also read

Related posts