SGSTV NEWS online
Andhra PradeshCrime

తండ్రికి సాయం చేసేందుకు వెళ్లి అంతలోనే తీవ్ర విషాదం..!

 
విశాఖ జిల్లా పద్మనాభం మండలం తునిపొలం గెడ్డలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తండ్రికి సాయం చేసేందుకు వెళ్లిన కూతురు గల్లంతు అయ్యింది. కాలుజారి ప్రమాదవశాత్తు గడ్డలో జారీపడిన బాలిక ధనుశ్రీ మునిగిపోయింది. రంగంలోకి దిగిన పోలీసులు రెవిన్యూ సిబ్బంది సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. ధనుశ్రీ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటన ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది.

విశాఖ జిల్లా పద్మనాభం మండలం తునిపొలం గ్రామంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదవశాత్తు గెడ్డలో జారిపడిన 13 ఏళ్ల బాలిక గల్లంతైన ఘటన గురువారం (అక్టోబర్ 30) చోటు చేసుకుంది. కాళ్ల ధనుశ్రీ (13) తల్లి గౌరి, తండ్రి శ్రీనుతో కలిసి బట్టలు ఉతికేందుకు గెడ్డకు వెళ్లింది. ఆ సమయంలో పొరపాటున కాలుజారి గెడ్డలోకి కొట్టుకుపోయిందని తల్లి గౌరి తెలిపారు. దీంతో ధనుశ్రీ ఆచూకీ కోసం గ్రామస్తులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు గెడ్డలో గాలింపు చర్యలు చేపట్టారు

Also read

Related posts