SGSTV NEWS
Andhra PradeshCrime

Andhra: తోబుట్టువుల మధ్య వివాదం… మృతదేహాన్ని మార్చురీకి తరలించిన పోలీసులు



గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం మేరికపూడిలో అంత్యక్రియలపై తోబుట్టువుల మధ్య తీవ్ర వివాదం చోటు చేసుకుంది. తండ్రి మృతదేహానికి ఎవరు అంత్యక్రియలు చేయాలన్న అంశంపై కుమారుడు, కుమార్తెల మధ్య వాగ్వివాదం చెలరేగింది. ఇరువర్గాలూ వెనక్కి తగ్గకపోవడంతో పోలీసులు రంగంలోకి దిగి మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. ఈ ఘటన గ్రామంలో చర్చనీయాంశంగా మారింది.

గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం మేరికపూడిలో ఒక కుటుంబ కలహం అంత్యక్రియల వరకు చేరింది. తండ్రి మృతదేహానికి ఎవరు అంత్యక్రియలు చేయాలన్న అంశంపై తోబుట్టువుల మధ్య విభేదాలు తలెత్తాయి. వాగ్వాదం పెరగడంతో పోలీసులు రంగంలోకి దిగారు. చివరికి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.

మేరికపూడికి చెందిన దేవరపల్లి వెంకటరెడ్డి (వృద్ధుడు) అనారోగ్యంతో మరణించాడు. ఆయనకు ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఇటీవల కాలంలో వెంకటరెడ్డి పెద్ద కుమార్తె వద్దే నివసిస్తున్నారు. ఆయన మరణం తెలిసిన వెంటనే పిల్లలందరూ గ్రామానికి చేరుకున్నారు. ఈ సమయంలో అంత్యక్రియలపై వివాదం తలెత్తింది. కుమారుడు తానే చేయాలంటూ ముందుకు రావగా, కుమార్తెలు మాత్రం తమ వద్దే ఉన్నందున తామే చేయాలని పట్టుబట్టారు.

ఇద్దరి వర్గాలూ వెనక్కి తగ్గకపోవడంతో వాగ్వివాదం పెద్దదైంది. ఈ వ్యవహారం పోలీసుల దాకా వెళ్లింది. ఇరు వర్గాలకూ పోలీసులు, రెవిన్యూ సిబ్బంది నచ్చజెప్పే ప్రయత్నం చేసినా అంగీకారం రాలేదు. చివరికి మృతదేహాన్ని గుంటూరు జిజిహెచ్ మార్చురీకి తరలించారు.

ఒక అంగీకారానికి వచ్చి పోలీసుల వద్దకు వస్తే మృతదేహాన్ని అప్పగిస్తామని అధికారులూ తెలిపారు. తండ్రి మృతదేహం అంత్యక్రియలు కుటుంబ కలహాల వల్ల ఆగిపోవడం, మార్చురీలో భద్రపరచడం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. అందరూ ఉన్నా… వృద్ధుడు అనాథగా మారిపోయాడు అని గ్రామస్తులు వాపోతున్నారు.

Also read

Related posts