తీయని మాటలు – ఆపై అశ్లీల వీడియోకాల్… కక్కుర్తి పడ్డారో ఖేల్ ఖతం.. సత్యసాయి జిల్లాలో హనీట్రాప్ కేసును చేధించారు పోలీసులు. నలుగురు నిందితుల అరెస్టు చేశారు. హనీ ట్రాప్లో మోసపోయానంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది ఒక్కరే. కానీ తీగలాగితే డొంక కదులుతుంది.
మహిళతో న్యూడ్ కాల్స్ చేయించి.. వాటిని రికార్డ్ చేసి, బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్న గ్యాంగ్‌ను కటకటాల్లోకి పంపారు లేపాక్షి పోలీసులు. మొత్తం నలుగురు నిందితుల అరెస్టు చేశారు. లేపాక్షి మండలం కొండూరు గ్రామానికి చెందిన ధనుంజయ, రవికుమార్, రమేశ్తో పాటు ఆ మహిళను అరెస్టు చేసి వారిని ఆదివారం రిమాండ్కు తరలించారు.
శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షి మండలం కొండూరుకు చెందిన ధనుంజయ్ అనే యువకుడు ఈ కేసులో ప్రధాన నిందితుడని తేల్చారు. ధనుంజయ్ ట్రాప్‌లో చిక్కుకుని.. సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి లక్షా యాభై వేలు నిందితులకు ఇచ్చాడు. సుబ్రహ్మణ్యం ఫిర్యాదుతో రంగంలోకి దిగిన లేపాక్షి పోలీసులు.. ఎంక్వైరీ చేయగా డొంక కదిలింది. ధనుంజయ్ గ్యాంగ్ చాలామందిని మోసం చేసిందని గుర్తించారు. ఓ రెవిన్యూ సెక్రెటరీ నుంచి దాదాపు మూడు లక్షల రూపాయలు వసూలు చేసినట్లు తేల్చారు. నిందితుల నుంచి నాలుగు సెల్ ఫోన్లు.. 45 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. మహిళ సహా నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. ఈ కేసులో మరింత మంది బాధితులు ఉన్నట్లు లేపాక్షి మండలంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. పోలీసులు తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- తుని ఘటన: టీడీపీ నేత నారాయణరావు మృతదేహం లభ్యం
- Telangana: అయ్యయ్యో.. ఇలా దొరికిపోతారని అనుకోలేదు.. ట్విస్ట్ మామూలుగా లేదుగా.. వీడియో వైరల్..
- పెళ్లి కోసం వచ్చిన వ్యక్తికి ఫుల్‌గా తాగించిన మైనర్లు.. తర్వాత ఏం చేశారో తెలిస్తే.. ఫ్యూజులెగరాల్సిందే
- Andhra: కడుపునొప్పితో మైనర్ బాలిక ఆస్పత్రికి.. ఆ కాసేపటికే..
- విజయవాడలోని ఈ ప్రాంతంలో భయం..భయం.. ఎందుకో తెలిస్తే అవాక్కే..