SGSTV NEWS
Andhra PradeshCrime

Andhra: పండగ వేళ వెంటాడిన మృత్యువు.. వేరుశనగ గొంతులో ఇరుక్కొని..



వరమహాలక్ష్మి పండగ.. దీంతో ఆ కుటుంబం వరలక్ష్మి వ్రతం ఆచరించడానికి అన్నీ సిద్ధం చేసుకుంది. భక్తి శ్రద్ధలతో పండుగ నిర్వహించేందుకు అంతా సిద్ధం చేశారు. ఈ క్రమంలో పిండి వంటలు తయారు చేయడంలో నిమగ్నమయ్యారు.. మరికాసేపట్లో వరలక్ష్మి వ్రతం ప్రారంభించాల్సి ఉంది..


వరమహాలక్ష్మి పండగ.. దీంతో ఆ కుటుంబం వరలక్ష్మి వ్రతం ఆచరించడానికి అన్నీ సిద్ధం చేసుకుంది. భక్తి శ్రద్ధలతో పండుగ నిర్వహించేందుకు అంతా సిద్ధం చేశారు. ఈ క్రమంలో పిండి వంటలు తయారు చేయడంలో నిమగ్నమయ్యారు.. మరికాసేపట్లో వరలక్ష్మి వ్రతం ప్రారంభించాల్సి ఉంది.. ఈ క్రమంలోనే.. ఆ కుటుంబాన్ని మృత్యువు వెంటాడింది. దీంతో ఆ కుటుంబంలో తీరని విషాదం చోటుచేసుకుంది. వెరుశెనగ గింజ గొంతులో ఇరుక్కుని రేండేళ్ల బాలుడు మృతి చెందిన విషాద ఘటన శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలో చోటుచేసుకుంది.


పెనుకొండ నగరపంచాయతీ పరిధిలోని వెంకటరెడ్డిపల్లికి చెందిన నాగరాజు, జ్యోతి దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. శుక్రవారం వరమహాలక్ష్మి పండగను పురస్కరించుకుని ఇంట్లో పిండి వంటలు తయారు చేస్తున్నారు. వరలక్ష్మి వ్రతం చేసుకునేందుకు పనుల్లో నిమగ్నమయ్యారు.

ఆ సమయంలో అటుగా వచ్చిన చిన్నకుమారుడు దీపక్‌ అలియాస్‌ బిట్టు (2).. వేయించిన వేరుసెనగ విత్తనాలను నోట్లో వేసుకున్నాడు.. దీంతో అవి గొంతులో ఇరుక్కున్నాయి.. అవి మింగలేక బిట్టు ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. క్షణాల్లోనే అపస్మారక స్థితిలోకి వెళ్లాడు.. దీంతో కుటుంబసభ్యులు బిట్టును హుటాహుటిన పెనుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.


బిట్టును పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. పండగ వేళ కుమారుడి మృతితో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.

Also read

Related posts

Share this