SGSTV NEWS
Andhra PradeshCrime

Andhra: అక్కతో పెళ్లి.. చెల్లితో ఎఫైర్.. అల్లుడి తల నరికేసిన పిల్లనిచ్చిన మామ.. ఎంత కసి ఉంటే ఇలా చంపాడో..

..


ఎంత కసి ఉంటేనో తల, మొండెం వేరు చేసి హత్య చేస్తారు. శత్రువును కూడా అంత దారుణంగా చంపరు.. కానీ శ్రీ సత్య సాయి జిల్లాలో పిల్లనిచ్చిన మామే.. అల్లుడిని అతి దారుణంగా హత్య చేశాడు.. అల్లుడి తల, మొండెం ఏకంగా వేరుచేసి కిరాతకంగా చంపాడు. కూతురిని ఇచ్చి పెళ్లి చేసిన అల్లుడిని అంత కసిగా ఎందుకు చంపాల్సి వచ్చిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరానికి చెందిన విశ్వనాథ్ కు 20 సంవత్సరాల క్రితం వెంకటరమణప్ప పెద్ద కుమార్తె శ్యామలతో వివాహం జరిగింది. విశ్వనాధ్ మామ వెంకటరమణప్ప రెండో కుమార్తెకు కూడా పెళ్లి చేసి పంపించాడు. అయితే విశ్వనాథ్ కన్ను మరదలుపై పడింది. కొన్నాళ్లకు విశ్వనాధ్ మరదలితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయమే ఇంట్లో గొడవలు మొదలవడంతో… అటు మామ వెంకటరమణప్ప అత్తకు మధ్య కూడా గొడవలు స్టార్ట్ అయ్యాయి. దీంతో అల్లుడు విశ్వనాథ్ అక్రమ సంబంధం పెట్టుకున్న మరదలిని, అత్తను తీసుకొచ్చి కదిరిలో ఉంటున్నాడు. అత్త పేరుతో ఉన్న భూమిని గత కొద్దిరోజులుగా విక్రయించాలని అల్లుడు విశ్వనాథ్ ప్రయత్నం చేస్తున్నాడు.

ఓవైపు రెండో కూతురితో అక్రమ సంబంధం.. మరోవైపు తన భార్యకు తనకు మధ్య గొడవలు రావడంతో.. విడిపోయిన తర్వాత తన భార్య పేరుతో ఉన్న భూమిని కూడా అమ్మాలని చూస్తున్న అల్లుడు విశ్వనాధ్ పై మామ వెంకటరమణప్ప ఆవేశంతో ఊగిపోయాడు. కన్న కూతురితో అక్రమ సంబంధం పెట్టుకుని విశ్వనాధుని ఎలాగైనా హత్య చేయాలని పిల్లనిచ్చిన మామ వెంకటరమణప్ప పెద్ద స్కెచ్ వేశాడు. మామ వెంకటరమణప్ప తన మిత్రుడు కాటమయ్యతో కలిసి అల్లుడు విశ్వనాధ్ ని హత్య చేసేందుకు పథకం రచించారు. కాటమయ్యకు నాలుగు లక్షల రూపాయలు సుపారీ ఇచ్చి… అల్లుడు విశ్వనాధ్ ని హత్య చేయాలనుకున్నాడు. పథకంలో భాగంగా ఈ నెల మూడవ తేదీన కాటమయ్య… వెంకటరమణప్ప అల్లుడు విశ్వనాథ్ కు వ్యవసాయంలో డబ్బు సాయం చేస్తానని… 50 వేల రూపాయలు ఇస్తానని నమ్మించి కదిరి నుంచి ముదిగుబ్బకు రప్పించాడు. ముదిగుబ్బకు వచ్చిన విశ్వనాథ్ ను కొండ ప్రాంతంలోకి తీసుకెళ్లి.. మామ వెంకటరమణప్ప, కాటమయ్య మరో ముగ్గురు కలిసి అతి దారుణంగా హత్య చేశారు. విశ్వనాధ్ తల, మొండెం వేరు చేసి కసి తీరా చంపారు.

రెండో కూతురుతో అక్రమ సంబంధం పెట్టుకోవడమే కాకుండా… తన కుమారులకు చెందాల్సిన భూమిని… విక్రయించాలని చూడడంతో… ఆవేశంతో రగిలిపోయిన మామ వెంకటరమణప్ప… అల్లుడు విశ్వనాధ్ ను అంతమొందించాడు. తల మొండెం వేరుచేసి హత్య చేసిన సంఘటన సంచలనం రేపడంతో… ముదిగుబ్బ పోలీసులు ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకున్నారు. సెల్ఫోన్ టవర్ లోకేషన్ ఆధారంగా.. మృతుడు విశ్వనాథ్… హత్య చేసిన మామ వెంకటరమణప్ప, కాటమయ్య… మరో ముగ్గురి ఫోన్ నెంబర్లు ఒకేచోట ఉండడంతో.. పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించడంతో… అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

ఈనెల మూడవ తేదీన మృతుడు విశ్వనాథ్ స్కూటీపై కదిరి నుంచి ముదిగుబ్బకు వస్తున్న దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డు అయింది. కానీ ముదిగుబ్బ నుంచి తిరిగి కదిరికి వెళ్ళిన దృశ్యాలు ఎక్కడ రికార్డు కాలేదు.. అయితే.. నిందితులు వెంకటరమణప్ప.. కాటమయ్య తో పాటు మరో ముగ్గురు హత్య చేసిన అనంతరం ఆటోలో వెళుతున్న దృశ్యాలు కూడా సీసీ కెమెరాలో రికార్డు అవ్వడంతో… విశ్వనాథ్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. విశ్వనాథ హత్య కేసులో మొత్తం ఐదుగురు నిందితులను అరెస్టు చేసి.. మూడు వేట కొడవళ్ళు, ఆటో, సెల్ ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పెద్ద కూతురుని ఇచ్చి పెళ్లి చేస్తే.. చిన్న కూతురుపై కన్నేసి అక్రమ సంబంధం పెట్టుకున్న అల్లుడు విశ్వనాధ్ పై మామ వెంకటరమణప్ప కక్ష పెంచుకున్నాడు.. కన్న కూతురితో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో రగిలిపోయిన తండ్రి… ఏకంగా అల్లుడి తల, మొండెం వేరుచేసి కసితీరా చంపడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

Also read

Related posts

Share this