SGSTV NEWS
Andhra PradeshCrime

Andhra: మందుబాబులకు గుండె పగిలే వార్త.. ఇన్నాళ్లు అక్కడ తాగింది కల్తీ పిచ్చి మందా.. వీడియో చూస్తే..



మందుబాబుల గుండె పగిలే వార్త ఇది…! తాగితే కిక్కు రాకపోగా… ప్రాణాలు పోయే భయంకరమైన దందా ఒకటి వెలుగులోకొచ్చింది. ఇక ఆ దందా గురించి తెలుసుకున్నాక… మీరు కొన్న లిక్కర్‌ బాటిల్‌ ఒరిజినలా..? నకిలీనా..? అన్న కన్‌ఫ్యూజన్‌ రావడం పక్కా..! ఎందుకో ఈ కథనం చదవండి..




మందుబాబుల గుండె పగిలే వార్త ఇది…! తాగితే కిక్కు రాకపోగా… ప్రాణాలు పోయే భయంకరమైన దందా ఒకటి వెలుగులోకొచ్చింది. ఇక ఆ దందా గురించి తెలుసుకున్నాక… మీరు కొన్న లిక్కర్‌ బాటిల్‌ ఒరిజినలా..? నకిలీనా..? అన్న కన్‌ఫ్యూజన్‌ రావడం పక్కా..! అన్నమయ్య జిల్లా మదనపల్లిలో తయారవుతున్న ఆ నకిలీ లిక్కర్‌ తయారీ విధానం గురించి తెలుసుకునే ముందు… అసలు దాని వెనకున్నది ఎవరు…? విచారణలో తేలిందేంటి…? అన్నది చూద్దాం.

అన్నమయ్య జిల్లా మదనపల్లిలో పట్టుబడ్డ భారీ కల్తీ మద్యం.. ఎక్సైజ్‌ పోలీసులనే షాక్‌కు గురిచేసింది. ఇవి అచ్చం ఒరిజినల్‌ బాటిల్స్‌లాగే ఉన్నాయ్. లేబుల్‌, హోలోగ్రామ్‌, సీలింగ్‌ అన్నీ పక్కా ఒరిజినల్‌లాగే కనిపిస్తాయ్‌. కానీ, అందులో ఉన్న లిక్కరే ఒరిజనల్ కాదు. ఎందుకంటే, పాత ఒరిజినల్‌ బాటిల్స్‌లో స్పిరిట్‌ నింపేసి మద్యం షాపుల ద్వారానే ఈ నకిలీ లిక్కర్‌ని అమ్మేస్తున్నారు కేటుగాళ్లు.. ములకలచెరువు దగ్గర ఈ నకిలీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు ఎక్సైజ్‌ పోలీసులు. నకిలీ లేబుల్స్‌, ఒరిజినల్‌ ఖాళీ బాటిల్స్‌తో కల్తీ లిక్కర్‌ తయారీ చేస్తున్నట్లు గుర్తించారు. బాటిల్ క్యాప్ నుంచి హాలోగ్రామ్ సీల్ వరకూ అంతా కాపీ కొడుతున్నట్లు తేల్చారు. బాటిల్స్‌లో స్పిరిట్‌ను నింపేసి అచ్చం బ్రాండెడ్‌ లిక్కర్‌లాగా సీలింగ్‌ చేసి జోరుగా దందా సాగిస్తున్న నలుగురు ఒడిశా వాళ్లతో పాటు 9 మంది నిందితులను అరెస్ట్‌ చేశారు. అంతేకాదు సీజ్‌ చేసిన మద్యం కోటి రూపాయల విలువ ఉంటుందని అంచనా వేస్తున్నారు. మొత్తం 13 మందిపై కేసు నమోదు చేశారు. మిగతా నలుగురి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.



అరస్టయిన మొత్తం 9 మందిలో ఒరిస్సా కు చెందిన నలుగురు, విజయవాడకు చెందిన ముగ్గురితోపాటు స్థానిక టిడిపి నేత ఉన్నారు.. వీరంతా ములకల చెరువు అనంతపురం హైవేకు పక్కనే మూసేసిన డాబా హోటల్ ను అద్దెకు తీసుకొని నకిలీ మద్యం తయారీ కేంద్రంగా మార్చి.. విక్రయాలు జరుపుతున్నారని పోలీసులు తెలిపారు. తయారుచేసిన నకిలీ మద్యాన్ని స్థానికంగా మద్యం దుకాణాలకు సరఫరా చేసి డబ్బులు దండుకుంటున్నారు. ఎక్సైజ్, స్థానిక పోలీసుల సంయుక్త దాడిలో ఈ లిక్కర్ స్కామ్ బయటపడిందని.. పోలీసులు తెలిపారు. లిక్కర్ తయారీకి వినియోగించే మెటీరియల్, మిషనరీ సీజ్ చేశారు. కేరమిల్‌, ఫ్లేవర్స్‌, వాటర్‌, స్పిరిట్‌ను ఒక ఫార్ములా ప్రకారం కలుపుతూ నకిలీ మద్యం తయారు చేస్తున్నారంటున్నారు పోలీసులు

Also read

Related posts