April 15, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

ఉదయమే నిద్రలేచిన ఊరు ఉలిక్కిపాటు.. మూడంతస్తుల భవనానికి వేలాడుతూ కనిపించిన డెడ్ బాడీ! తీరా చూస్తే..



వృద్ధాప్యం శాపంగా మారిందో.. లేదంటే ధనవంతుడిగా సమాజంలో మెలగడమే అతడిని బలి తీసుకుందో తెలియదుగానీ ఓ వృద్ధుడు మూడు అంతస్థుల భవనానికి ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. అయితే ఇది హత్య.. ఆత్మహత్య అనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. అయితే.. సినీ ఫక్కీలో భారీ భవనానికి వృద్ధుడి డెడ్ బాడీ వేలాడటం ఆ ఊరి జనాలను కలవరపాటుకు గురిచేసింది..


మదనపల్లి, ఏప్రిల్ 14: అన్నమయ్య జిల్లా మదనపల్లిలో దారుణం జరిగింది. ఇంటి గుమ్మానికి వేలాడిన మృతదేహం కలకలం రేపింది. దేవళం వీధిలో జరిగిన ఘటన సంచలనంగా మారింది. తెల్లారేసరికి మూడంతస్తుల భవనం ముందు వేలాడుతున్న మృతదేహాన్ని చూసిన స్థానికుల గుండె ఆగిపోయినంత పని అయింది. తీరా చూస్తే మూడంతస్తుల భవనానికి వేలాడుతున్నది ఆ ఇంటి యజమాని శవమని తేలింది. ఈ మేరకు స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా సొంత ఇంటి గ్రిల్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకొన్న 65 ఏళ్ల సయ్యద్ జాఫర్ హుస్సేన్ ఘటన అందరినీ కలచివేసింది.


దేవలం వీధిలో సొంతింటిలో మూడో అంతస్తులో ఉన్న షయ్యద్ జాఫర్ హుస్సేన్ మరణానికి కారణాలు ఏవైనా కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. పిల్లలు విదేశాల్లో స్థిరపడటంతో మదనపల్లి లోనే ఒంటరిగా ఉన్న సయ్యద్ జాఫర్ హుస్సేన్ ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడన్న దానికి ఒంటరితనమే కారణమన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కన్న బిడ్డలు బయట దేశాల్లో స్థిరపడడం, తమదగ్గరికి రమ్మని కొడుకు, కూతురు వేడుకున్నా విదేశాలకు వెళ్ళడానికి ఇష్టపడని సయ్యద్ జాఫర్ హుస్సేన్ జీవితంపై విరక్తి కలిగే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు స్థానికులు చర్చ నడుస్తుంది.

సొంతూరు, సొంతింటిపై మమకారంతో మదనపల్లిలోనే జీవనం సాగిస్తున్న సయ్యద్ జాఫర్ గత కొంతకాలంగా ఒంటరి జీవితం గడుపుతున్నారు. ఒంటరిగా ఉండటం విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్న పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విదేశాల్లో ఉన్న బిడ్డలు వస్తే తప్ప సొంతింటి గుమ్మానికి వేలాడిన సయ్యద్ జాఫర్ హుస్సేన్ కేసులో మదనపల్లి వన్ టౌన్ పోలీసులకు క్లారిటీ వచ్చే అవకాశం లేదు. ఏది ఏమైనా బిడ్డలు దూరంగా ఉండడం, ఊరు వదిలి వెళ్లేందుకు ఇష్టం లేకపోవడం, ఒంటరిగా వృద్ధాప్యంలో ఉండలేకపోవడం ఈ దారుణానికి కారణమని భావిస్తున్న స్థానికుల మనసులను ఈ ఘటన కలిచి వేసింది. పోలీసుల దర్యాప్తు ఏ విషయాన్ని బయట పెడుతుందో చూడాల్సి ఉంది.

Also read

Related posts

Share via