SGSTV NEWS
Andhra PradeshCrime

స్పోర్ట్స్ యూనిఫాం‌లో స్కూల్‌కొచ్చిన విద్యార్ధిని.. కట్ చేస్తే.. దెబ్బకు ఆగమాగం.. ఏం జరిగిందంటే..!

బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం చింతాయపాలెం హైస్కూల్‌లో స్పోర్ట్స్ యూనిఫాం వ్యవహారంలో వివాదం రాజుకుంది. ఏకంగా విద్యార్థినిపై దాడి చేశాడు సస్పెండైన టీచర్‌ మస్తాన్‌రెడ్డి. ఈ నేపథ్యంలో స్కూల్ యాజమాన్యం విచారణ కమిటీ వేసింది. దీంతో ఈ విషయంలో విచారణ జరుగుతుండగా విద్యార్థినిపై దాడి చేశాడు సస్పెండైన టీచర్‌ మస్తాన్‌రెడ్డి.

విచారణ కోసం కమిటీ ముందు హాజరైంది స్పోర్ట్స్‌ కమిటీ విద్యార్థిని.. ఆమెకు తోడుగా తల్లి కూడా వచ్చింది అయితే, పీఈటీ గోపిపై విచారణ జరుగుతుండగా తన మొబైల్‌ ఫోన్‌లో వీడియో తీశాడు సస్పెండైన టీచర్‌ మస్తాన్‌రెడ్డి. వీడియో రికార్డింగ్‌ను అడ్డుకున్న విద్యార్థినిపై మస్తాన్‌రెడ్డి దాడికి దిగాడు. కూతురిపై మస్తాన్‌రెడ్డి దాడి చేయడంతో అడ్డుకున్న విద్యార్థిని తల్లి.. అతనితో బాహాబాహీకి దిగింది. విద్యార్థిని, ఆమె తల్లి కలిసి.. టీచర్‌ మస్తాన్‌రెడ్డిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే, ఇద్దరి నుంచి తప్పించుకున్న మస్తాన్‌రెడ్డి అక్కడ్నుంచి గోడ పారిపోయాడు. ఈ ఘటనకు సంబంధించి ఇరు వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు

Also read

Related posts

Share this