SGSTV NEWS
Andhra PradeshCrime

Andhra: రేయ్ ఏంట్రా ఇది.. ఇన్సూరెన్స్ సొమ్ము కోసం మాస్టర్ ప్లాన్.. చంపి ముక్కలు చేసి..



ఇన్సూరెన్స్ సొమ్ము ఒక వ్యక్తి ప్రాణాలను బలి తీసుకుంది. మూడున్నర నెలల తరువాత మృతదేహం గుర్తింపుతో సంచలన వ్యవహారం వెలుగు చూసింది. హైకోర్టు, హ్యూమన్‌ రైట్స్‌ చొరవతో కేసు కొలిక్కి వచ్చింది. చిత్తూరు జిల్లా నగరి మండలం ఎం.కొత్తూరు చెరువులో మృతదేహం ముక్కలు లభించగా.. మృతదేహం కోసం చెరువులో పోలీసుల గాలింపు కొనసాగుతోంది.

ఇన్సూరెన్స్ సొమ్ము ఒక వ్యక్తి ప్రాణాలను బలి తీసుకుంది. మూడున్నర నెలల తరువాత మృతదేహం గుర్తింపుతో సంచలన వ్యవహారం వెలుగు చూసింది. హైకోర్టు, హ్యూమన్‌ రైట్స్‌ చొరవతో కేసు కొలిక్కి వచ్చింది. చిత్తూరు జిల్లా నగరి మండలం ఎం.కొత్తూరు చెరువులో మృతదేహం ముక్కలు లభించగా.. మృతదేహం కోసం చెరువులో పోలీసుల గాలింపు కొనసాగుతోంది. ఇచ్చిన అప్పు తిరిగి అడుగుతున్నాడన్న కోపం, ఇన్సూరెన్స్‌ డబ్బులో వాటా ఇవ్వలేదన్న కసి.. ఇలా ఓ వ్యక్తిని కిరాతకంగా చంపేసి ముక్కలుగా నరికి చెరువులో విసిరేసినట్లు తేలింది. పుదుపేటకు చెందిన 65 ఏళ్ల గుణశీలన్‌ ను కిరాతకంగా చంపి.. 33 ఏళ్ల అయ్యప్పన్‌, 55 ఏళ్ల గంగాధరంలు ఈ ఘాతుకానికి ఒడికట్టారు. నగరి మండలం ఎం.కొత్తూరు చెరువుగట్టుపై మూడున్నర నెలలక్రితం ఈ ఘటన చోటుచేసుకుంది. తమిళనాడు పోలీసులు వెల్లడించిన వివరాలు షాక్ కు గురిచేస్తున్నాయి.

నగరి మున్సిపాలిటీ పరిధిలోని పుదుపేటకు చెందిన పీవీ గుణశీలన్‌ కు నలుగురు సంతానం.. విజి సంగీత, విజి జ్యోతి అనే ఇద్దరు కూతుళ్లు, విజి వసంత్, విజి విజయ్‌ అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. అందరికీ పెళ్లి కాగా పెద్ద కొడుకు వసంత్‌ చెన్నైలో ఉద్యోగం చేస్తూ అక్కడే ఉంటున్నాడు. ఇక కూతుళ్లు సంగీత తిరుత్తణిలో, జ్యోతి నారాయణవనంలో పెళ్ళై స్థిరపడ్డారు. ఇక చిన్న కొడుకు విజయ్‌ చెన్నైలోని ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నాడు. పుదుపేటలోనే ఉంటున్న గంగాధరం కూతురు కౌసల్యతో విజయ్ కు పెళ్లి కాగా కుటుంబ తగాదాలతో ఆరు నెలలకే 2022లోనే విజయ్‌ ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. అయితే అప్పటికే అతను ఐసీసీఐ లో రూ 50 లక్షలు, కొటక్‌లో రూ 40 లక్షలకు ఇన్సూరెన్స్‌ పాలసీ చేసి ఉండటంతో ఇన్సూరెన్స్‌ డబ్బు రూ.1.25 కోట్ల దాకా వచ్చింది. ఈ నగదు గుణశీలన్, కళావతి ఖాతాలకు జమ అయింది.

అయితే అల్లుడు చనిపోతే వచ్చిన ఇన్సూరెన్స్‌ డబ్బులో తమ కూతురు కు కూడా వాటా ఇవ్వాలని వియ్యంకుడైన గంగాధరం గొడవపడేవాడు. ఈ దశలో నగరిలో విడిగా ఉండలేక గుణశీలన్‌ ఆయన భార్య కళావతి తిరుత్తణిలో ఉన్న కూతురు సంగీత వద్దే ఉండిపోయారు. పద్మావతినగర్‌లో ఆమె నిర్మించే ఇంటి నిర్మాణ పనులు చూసుకుంటూ అక్కడే ఉండిపోయారు. పుదుపేటలో ఇల్లు ఖాళీ చేసి ఆ ఇంటిని గుణశీలన్‌ తనకు పరిచయం ఉన్న బుగ్గఅగ్రహారం గ్రామానికి చెందిన అయ్యప్పన్‌కు అద్దెకు ఇవ్వడంతో పాటు తరచూ తన కుటుంబ విషయాలు అతనికి చెబుతూ వచ్చాడు. మాటల్లో గుణశీలన్‌ వద్ద డబ్బులున్న విషయాన్ని గ్రహించిన అయ్యప్పన్‌ మరింత చనువు పెంచుకున్నాడు.

వడ్డీకి కొంత డబ్బు ఇస్తే వ్యాపారం చేసి నెలనెలా ఇస్తానని మూడు దఫాలుగా రూ.28 లక్షలు దాకా అప్పుగా తీసుకున్నాడు. ఈ డబ్బుల్లో రూ.3.60 లక్షలు మాత్రమే తిరిగి ఇచ్చి మిగిలిన డబ్బులకు సమాధానం చెప్పకుండా ఉండటంతో.. డబ్బులు తిరిగి చెల్లించాలని గుణశీలన్‌ గట్టిగా నిలదీశాడు. ప్రతిరోజు ఉదయం కూతురు ఇంటి నిర్మాణ పనులను చూసుకునేందుకు క్యారియర్ తో వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగివచ్చే గుణశీలన్‌ 2025 జూన్‌ 6వ తేదీ వెళ్లి ఇంటికి తిరిగిరాలేదు. నాలుగు రోజులపాటు రాకపోవడం, ఫోన్‌ పనిచేయకపోవడంతో కూతురు సంగీత తిరుత్తణి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదుచేసింది. ఈ మేరకు మ్యాన్ మిస్సింగ్‌ కేసు నమోదైంది.

అయితే, కేసులో నెలల తరబడి ఎలాంటి పురోగతి లేకపోవడంతో సంగీత ఎస్పీ, కమిషనర్‌ లకు ఇలా అందరికీ ఫిర్యాదులు చేస్తూ వచ్చింది. ఎంతకూ కనిపెట్టకపోవడంతో హైకోర్టులో కేసువేసి హ్యూమన్‌రైట్స్‌ను సంప్రదించింది. దీంతో కేసులో కదలిక వచ్చింది. దర్యాప్తు వేగవంతమై మూడున్నర నెలల తరువాత ఒక కొలిక్కివచ్చింది. అనుమానితుడైన అయ్యప్పన్ ను విచారించగా అసలు నిజం బయటపడింది.

చంపి ముక్కలు చేశారు..
అప్పు అడుగుతున్నాడన్న కోపంతో ఉన్న అయ్యప్పన్, ఇన్సూరెన్స్‌ డబ్బుల్లో తన కూతురుకు వాటా ఇవ్వలేదని కసితో ఉన్న గంగాధరం కలిసి హత్యకు ప్లాన్ చేశారు. నిర్మాణ పనుల వద్ద ఉన్న గుణశీలన్‌ వద్దకు వెళ్లిన అయ్యప్పన్‌ అప్పుల విషయం మాట్లాడాలని జూన్‌ 6వ తేది మధ్యాహ్నం నగరిలోని ఇంటికి తీసుకువచ్చాడు. మాటల్లో ఉండగా గంగాధరం కూడా ఇంటివద్దకు వచ్చి గుణశీలన్‌తో గొడవకు దిగాడు. ఇదే సమయంలో అయ్యప్పన్‌ గుణశీలన్‌ను తల వెనుకవైపు బలమైన కర్రతో కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. చీకటిపడ్డాక ఇద్దరూ కలిసి మృతదేహాన్ని గోనెసంచిలో చుట్టుకొని నగరి మండలంలోని ఎం.కొత్తూరు చెరువుకట్టవద్దకు చేరుకున్నారు. కసి తీరా మృతదేహం తలను నరికి ఒకవైపు విసరగా మొండెంను చేతులు, కాళ్లు నరికి ముక్కలు చేసి గోనెసంచిలో కట్టి నదిలో పడేశారు.. ఈ మేరకు నిందితులు పోలీసుల విచారణలో వెల్లడించారు.

దీంతో నిందితులను తిరుత్తణి పోలీసులు చెరువు వద్దకు తీసుకొచ్చారు. మృతదేహాన్ని వేసిన ప్రాంతాన్ని గాలించారు. చెరువులో గోనె సంచిని గుర్తించిన పోలీసులు బయటకు తీసే ప్రయత్నం చేశారు. చీకటి పడటంతో గాలింపు చర్యలను నిలిపివేసిన పోలీసులు బుధవారం తిరిగి గాలింపు చర్యలు చేపట్టారు. ఎం.కొత్తూరు లో సంచలనగా మారిన హత్య వ్యవహారం పై ఆందోళనకు గురైన గ్రామస్తులు పెద్ద ఎత్తున గుమి కూడారు. కాగా.. ఈ ఘటన సంచలనంగా మారింది

Also read

Related posts