SGSTV NEWS
Andhra PradeshCrime

మహిళ దుస్తులు, నిమ్మకాయలు.. ఆలయం దగ్గర్లో చెట్ల మాటున అదో మాదిరి ఆకారం.. తీరా చూడగా..

కర్నూలు జిల్లాలో ప్రముఖ శైవ క్షేత్రం మహానందిలో క్షుద్రపూజల అనవాళ్లు కలకలం రేపుతుంది. ఆలయ సమీపంలోని గరుడనంది దేవాలయంలో దగ్గరల్లో క్షుద్రపూజల ఆనవాళ్ళును స్థానికులు గుర్తించారు. ఎన్నడూ లేని విధంగా మహానంది ఆలయం సమీపంలో ఈ ఘటన జరగడం అందరిని భయభ్రాంతులకు గురి చేస్తోంది.


కర్నూలు జిల్లాలో ప్రముఖ శైవ క్షేత్రం మహానందిలో క్షుద్రపూజల అనవాళ్లు కలకలం రేపుతుంది. ఆలయ సమీపంలోని గరుడనంది దేవాలయంలో దగ్గరల్లో క్షుద్రపూజల ఆనవాళ్ళును స్థానికులు గుర్తించారు. ఎన్నడూ లేని విధంగా మహానంది ఆలయం సమీపంలో ఈ ఘటన జరగడం అందరిని భయభ్రాంతులకు గురి చేస్తోంది. గరుడనంది దేవాలయంలో దగ్గరలోని నిర్మాణుష్య ప్రదేశంలోని చెట్ల పొదల్లో క్షుద్రపూజలు జరిగినట్లు స్థానికులు చెప్పారు.. దుండగులు క్షుద్రపూజల కోసం పసుపు, కుంకుమ, సున్నం, నిమ్మకాయలు, మహిళ దుస్తులు ఉపయోగించి.. తంత్ర పూజలు చేసినట్లు స్థానికులు గుర్తించారు.


ప్రస్తుతం మహానందిలో ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. క్షుద్రపూజలకు సంభందించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూన్నాయి. ఈ పూజలు రెండు రోజుల క్రితం జరిగినట్లు ఆలయ అధికారులు అనుమానిస్తన్నారు. ఆ పరిసరాల్లో ఎవరెవరు.. ఎప్పుడెప్పుడు సంచరించారు అనే విషయంపై పోలీసులు సిసి కెమెరాల ద్వారా పరిశీలిస్తున్నారు.


కాగా.. శైవ క్షేత్రంలో క్షుద్రపూజలు చేసిన ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.. ఈ విధంగా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు

Also read

Related posts

Share this