తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. బ్యాటరీల నిల్వ ప్రాంతంలో మంటలు చెలరేగాయి. ఎస్పీఎఫ్ సిబ్బంది తక్షణమే అగ్ని మాపక శాఖకు సమాచారం అందించారు. మంటలు అదుపులోకి వచ్చాయి. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సచివాలయంలో రెండో బ్లాక్‌లో బ్యాటరీలు ఉంచే ప్రాంతంలో మంటలు చెలరేగినట్లు సమాచరం. వెంటనే ఎస్పీఎఫ్ సిబ్బంది ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. కాగా ప్రమాదానికి గల కారణాలపై భద్రతా సిబ్బంది దర్యాప్తు చేపట్టారు.
రెండో బ్లాక్‌లోనే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, టూరిజం మంత్రి కందుల దుర్గేష్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, హోం మంత్రి వంగలపూడి అనిత పేషీలు ఉన్నాయి. తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరగడంతో సిబ్బంది ఎవరూ కార్యాలయం లోపల లేరని సమాచారం. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
హోం మంత్రి ఆరా..
సచివాలయంలోని రెండో బ్లాక్‌లో జరిగిన అగ్ని ప్రమాదంపై హోంమంత్రి అనిత ఆరా తీశారు. ఫైర్ సిబ్బంది అప్రమత్తమై మంటలను ఆర్పినట్లు పోలీస్ ఉన్నతాధికారులు హోం మంత్రికి వెల్లడించారు. బ్యాటరీలు ఉండే ప్రాంతంలో ప్రమాదం జరిగినట్లు వివరించారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపి ప్రమాదానికి గల కారణాలను తేల్చాలని సంబంధిత అధికారులను హోంమంత్రి ఆదేశించారు
Also read
- AP Crime: ఏపీలో మరో పరువు హత్య.. మైనర్ బాలికను చంపేసిన పేరెంట్స్!?
- సర్కార్ గట్టుకు మరమ్మతులు చేపట్టిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ళ రాము
- గురు, రాహువులతో ఆ రాశులకు ఐశ్వర్య యోగాలు..!
- Vastu Tips: ఈ పక్షులు ఇంటికొస్తే మీ దశ తిరిగినట్టే.. ఈ మూగజీవాలు ఇచ్చే సంకేతాలివే..
- నేటి జాతకములు.11 ఏప్రిల్, 2025