తెల్లారేసరికి ఇంటి బయటకు వచ్చిన ఓ వ్యక్తీకి.. ఎదురుగా పెద్ద గుంత కనిపించింది. ఆ ప్రాంతంలో ఏదో భూమి కృంగినట్టుగా ఉంది. అయితే ఆ గుంత లోపల ఏదో ఉందని అనుమానమొచ్చిన గ్రామస్తులకు వెళ్లి చూడగా.. ఈ ఘటన నంద్యాలలో చోటు చేసుకుంది.
నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గం సంజామల మండలం పేరుసోముల గ్రామంలో పురాతన శివుని గుడి బయటపడింది. గ్రామంలోని కోట వీధిలో ఉన్న మద్దిలేటి ఇంటి ముందు గండి ఏర్పడింది. ఏంటా అని స్థానికులు పరిశీలించగా.. ఆ ఇంటి కింద పురాతన శివాలయం బయటపడింది. దీంతో స్థానికులు పెద్ద ఎత్తున శివాలయం చూసేందుకు తరలివస్తున్నారు.
ఈ పురాతన శివాలయం రాజుల కాలం నాటిది. ఈ శివాలయం చాలా సంవత్సరాల కిందట కొందరు వ్యక్తులు ఆనవాళ్లు లేకుండా చేశారు. ఆ శివాలయం భూమి కింద ఉన్నది. బెస్త మద్దిలేటి అనే అతను శివాలయం ఉందని తెలియక ఇల్లు కట్టుకున్నాడు. కొద్ది రోజుల క్రితం శివాలయం ఉందని తెలిసింది. తెలిసిన వెంటనే ఆ ఇంటిని ఖాళీ చేశారు. ఇప్పుడు ఆ శివునికి పూజలు చేయటం కోసం పేరు సోమల గ్రామస్తుల సమక్షంలో బెస్త మద్దిలేటి శివాలయానికి పూడికతీత తీసి దారి ఏర్పాటు చేశారు. శివాలయం గుడికి ప్రక్కనే పెద్ద కోనేరు ఉన్న ఆనవాళ్లు ఉన్నట్లు స్థానికులు అంటున్నారు. దీంతో ప్రజలు తండోపతండాలుగా వచ్చి పూజలు చేయడం మొదలు పెట్టారు. తెలుగు సంవత్సర ఉగాది రానున్న సందర్భంలో ఈ శివాలయంలో పూజలు చేసుకోవడం ప్రజలు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025