పాఠాలు చెప్పాల్సిన టీచర్.. స్టూడెంట్‌తో కలిసి ప్రేమ పాఠాలు చదివింది. ఈ పాడులోకంలో మన ఇద్దరినీ కలిపి ఉండనివ్వరని.. వేరే ఊరు పారిపోయారు. కట్ చేస్తే.! పోలీసుల ఎంట్రీతో దెబ్బకు షాక్ అయ్యారు. ఆ వివరాలు ఇలా.. ఓ సారి లుక్కేయండి మరి.
ప్రేమ హద్దులు మీరింది. వయస్సుతో సంబంధం లేకుండా చేసింది. పూతలపట్టు దగ్గరలో ఉన్న ఒక ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ స్టూడెంట్ అక్కడ పనిచేసే స్టాఫ్ మధ్య ప్రేమకు దారి తీసింది. చిత్తూరు దుర్గానగర్ కాలనీకి చెందిన 20 ఏళ్ల యువకుడు బీటెక్ చదువుతూ ప్రేమలో పడ్డాడు. ప్రేమించింది క్లాస్‌మేట్‌ను కాదు. ఆ కాలేజీ ల్యాబ్‌లో పనిచేస్తున్న దాదాపు 40 ఏళ్ల వయస్సు ఉన్న మహిళా ఉద్యోగిని ఆకర్షించాడు.
పెళ్లయి భర్త నుంచి విడిపోయి జీవనం సాగిస్తున్న సదరు మహిళ అదే కాలేజీలో నాన్ టీచింగ్ స్టాఫ్‌గా పని చేస్తోంది. రోజూ కాలేజీకి వెళుతున్న విద్యార్థికి ఆ మహిళతో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరి మధ్య వయస్సు సగం తేడా ఉన్నా.. వీళ్ల మధ్య స్నేహం కొనసాగింది. అయితే పెళ్లికి సమాజం ఒప్పుకోదని భావించిన ఇద్దరు.. తమకు అభ్యంతరం చెప్పని చోటుకు వెళ్లిపోవాలని భావించారు. ఈ మేరకు మూడు రోజుల క్రితం బెంగళూరుకు వెళ్లిపోయారు. కాలేజీకి వెళ్లిన కొడుకు ఇంటికి తిరిగి రాకపోవడంతో మూడు రోజులుగా ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులు.. చిత్తూరు టూ టౌన్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తుండగా.. అసలు విషయం బయటపడింది.
సాంకేతిక ఆధారంగా పోలీసులు గుర్తించారు. చిత్తూరుకు వెళ్లి ఇద్దరిని గుర్తించిన పోలీసులు తిరిగి తీసుకొచ్చారు. తహశీల్దార్ ఎదుట బైండోవర్ చేసిన పోలీసులు తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. 20 ఏళ్ల స్టూడెంట్ పేరెంట్స్‌కు, 40 ఏళ్ల మహిళ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చిన పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. స్టూడెంట్‌ను పేరెంట్స్‌కు అప్పగించిన పోలీసులు.. మహిళను కూడా ఇంటికి పంపారు. దీంతో 20 ఏళ్ల స్టూడెంట్, 40 ఏళ్ల కాలేజీ స్టాఫ్ మహిళ ప్రేమ బ్రేకప్ అయ్యింది. కాలేజీలో జరిగిన యవ్వారం బయట పడడంతో స్టూడెంట్స్, కాలేజీ స్టాఫ్ ఆశ్చర్యానికి లోనయ్యారు.
Also read
- Job Astrology: గ్రహాల అనుకూలత.. ఈ రాశులకు పదోన్నతి, అధికార యోగాలు..!
- దీపావళి రోజున ఈ రాశుల జీవితాల్లో దీపాల వెలుగులు.. త్రిగ్రహి యోగంతో అపార సంపద
- TG Crime: జనగామ జైలులో కలకలం.. బ్లీచింగ్ పౌడర్ నీళ్లు తాగి రిమాండ్ ఖైదీ సూ**సైడ్.. కారణం ఇదేనా?
- Khammam : వీడు టీచర్ కాదు టార్చర్.. అబ్బాయిపై లైంగిక వేధింపులు.. రోజు రాత్రంతా!
- Dialysis: డయాలసిస్ కేంద్రాలకు వెళ్ళే వారికి కొత్తరోగాలు.. రాష్ట్రంలో షాకింగ్ ఘటనలు!