విధి ఆడిన వింత నాటకంలో ఓ బాలిక ఆశువులు బాసింది. కోటి ఆశలతో కష్టపడి చదివింది. పదో తరగతి పరీక్షలు కూడా రాసింది. 500కిపైగా మార్కులు వస్తాయని తల్లిదండ్రులకు ఎంతో నమ్మకంగా చెప్పింది. మరో 5 రోజుల్లో ఫలితాలు కూడా వచ్చేవే. కానీ అంతలోనే ఆ బాలిక ఆనందం ఆవిరైంది. ఊహించని విధంగా..
నంద్యాల, ఏప్రిల్ 27: బాగా చదివి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆ విద్యార్థిని ఎన్నో కలలుగంది. కలలేకాదు.. అందుకు తగ్గట్లుగా బాగా చదివి పదోతరగతి పరీక్షలు కూడా రాసింది. ఫలితాల కోసం ఎన్నో ఆశలతో ఎదురుచూస్తుండగా అనారోగ్యం ఆమెను కబలించింది. మరో ఐదు రోజుల్లో ఫలితాలు వెలువడనుండగా.. బాలిక అనంతలోకాలకు చేరింది. ఈ విషాద ఘటన నంద్యాల జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..
నంద్యాల జిల్లా దొర్నిపాడు మండలం చాకరాజువేముల గ్రామానికి చెందిన దేవరాజు, మరియమ్మలకు ఐదుగురు కుమార్తెలు. నాలుగో కుమార్తె సారా. సారా దొర్నిపాడు జడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదివి పరీక్షలు కూడా రాసింది. పరీక్షల్లో తనకు 500కుపైగా మార్కులు వస్తాయని కూడా తల్లిదండ్రులకు చెప్పింది. మరో ఐదు రోజుల్లో ఫలితాలు వస్తాయనంగా ఉన్నట్లుండి సారా అనారోగ్యానికి గురైంది. సారా అనారోగ్యానికి గురికావడంతో తల్లిదండ్రులు ఆస్పత్రిలో చేర్పించారు. బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలిక ఏప్రిల్ 19న మృతి చెందింది. అనంతరం ఏప్రిల్ 23 (బుధవారం) విడుదలైన ఫలితాల్లో సారాకు 557 మార్కులు సాధించింది. కుమార్తె చనిపోయిన తర్వాత అధికంగా మార్కులు వచ్చిన సంగతి తెలుసుకున్న సారా తల్లిదండ్రులు ఆమెను తల్చుకుంటూ కన్నీరుమున్నీరుగా విలపించారు. తమ కుమార్తె సారా చనిపోయే ముందు 500 పైగా మార్కులు వస్తాయని తనకు చెప్పిందని గుర్తుకు తెచ్చుకుంటూ ఆమె తండ్రి కంటతడి పెట్టారు.
బాగా చదివి భవిష్యత్తులో ఉన్నతంగా స్థిరపడాలని తమ కుమార్తె ఎన్నో కలలు కనిందని.. పదోతరగతి పరీక్షలు కూడా బాగా రాసిందని చెబుతున్నారు. అయితే పదో తరగతి పరీక్షల ఫలితాల కోసం ఎదురుచూస్తుండగా.. ఇలా అనారోగ్యం తమ కుమార్తెను బలితీసుకుందని కలలో కూడా ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సారా మృతి ఘటన గ్రామంలో ప్రతి ఒక్కరిని కలచివేసింది. పదో తరగతి పరీక్షల ఫలితాలు వచ్చిన తర్వాత ఈ విషాదం వెలుగులోకి వచ్చింది
Also read
- Andhra News: తండ్రి కోసం బుల్లెట్ బైక్ కొన్న కూతురు.. కానీ బైక్ తండ్రికి ఇచ్చేలోపే….
- Wearing Toe Rings: వివాహిత స్త్రీ కాలి మెట్టెలు పోగొట్టుకుంటే.. భర్తకు సంబంధించిన ఈ సంకేతాలకు సూచనట
- Weekly Horoscope: వారికి ఆర్థికంగా ఢోకా ఉండదు.. 12 రాశుల వారికి వారఫలాలు
- మూడు రోజుల కిందట చిన్నారి, ఇప్పుడు చిన్నారి తల్లి, అమ్మమ్మ మృతి..! అసలు ఏం జరిగిందంటే..?
- అనుమానాస్పద స్థితిలో నర్స్ మృతి