పది రోజుల పసికందును తల్లి నుంచి దూరం చేసింది.. స్నేహితురాలిగా ఇంటికి వచ్చి ఆమెతోనే ఉండి డెలివరీ సమయంలో సహాయం చేసి.. పది రోజుల తర్వాత తల్లి నిద్రిస్తున్న సమయంలో బిడ్డతో ఉడాయించింది ఓ ప్రబుద్ధురాలు.. తీరా నిద్రలేచి చూసే సమయానికి బిడ్డ లేకపోవడంతో కన్నీరు మున్నీరుగా విలపించిన ఆ తల్లి పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని కడపలో చోటుచేసుకుంది.
కడప జిల్లా పులివెందులలో పది రోజుల పసికందును ఎత్తుకెళ్లింది కుమారి అనే మహిళ.. తల్లి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో పది రోజుల బిడ్డతో పారిపోయింది.. వివరాలలోకి వెళితే పులివెందులకు చెందిన గర్భిణీ స్త్రీగా ఉన్న కుళ్లాయమ్మ తన స్నేహితురాలు కుమారిని తనకు సహాయం చేయవలసిందిగా అడిగింది. దీంతో ఈనెల 16వ తేదీన కుమారి అనే మహిళ కుళ్లాయమ్మ ఇంటికి వచ్చింది. ఆ తరువాత కుళ్లాయమ్మ ఈనెల 18వ తేదీన కడప రిమ్స్ ఆసుపత్రిలో మగ శిశువుకు జన్మనిచ్చింది. తర్వాత వీరు కడప నుంచి పులివెందుల కు వెళ్లి వారి ఇంట్లో ఉంటున్నారు. స
రిగ్గా నిన్న మధ్యాహ్నం సమయంలో కుళ్లాయమ్మ నిద్రిస్తున్న సమయంలో ఆమె స్నేహితురాలు కుమారి కుళ్లాయమ్మకు జన్మించిన పది రోజుల మగసిశువును తీసుకొని పులివెందులలో ఆటో ఎక్కి వెళ్ళిపోయింది. నిద్రలేచి చూసే సమయానికి తన కొడుకు లేకపోవడంతో తన భర్తకు, బంధువులకు చెప్పింది. దీంతో వారు పులివెందుల పరిసర ప్రాంతాలలో కుమారి కోసం వెతికారు.
అయితే కుమారి జాడ తెలియకపోవడంతో ఈరోజు ఉదయం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే పులివెందుల డిఎస్పి మురళి నాయక్ స్పందించారు. నలుగురు సీఐలను, ఐదుగురు ఎస్ఐలతో పోలీసు బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.
వీడియో చూడండి..
గర్భిణీగా ఉన్న తనకు సాయం చేయాలని కుమారిని కోరానని అయితే ఇలా చేస్తుందని అనుకోలేదని బాధితురాలు తెలిపింది. అయితే కుమారిని పులివెందుల పోలీసులు తాడిపత్రిలో గుర్తించినట్లు తెలుస్తుంది
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025