Andhra Pradesh: ప్రాణం తీసిన లోన్ యాప్.. పెళ్లై నెల రోజులే.. అంతలోనే భార్య ఫోన్‌కు షాకింగ్ ఫొటోలు..
లోన్ యాప్ వేధింపుల టార్చర్ ఏ విధంగా ఉందో చెప్పడానికి ఈ ఘటన ఓ ఉదాహరణ. వేధింపులకు కుటుంబాలు ఎలా బలైపోతున్నాయో వివరిస్తోంది ఈ ఇన్సిడెంట్. కేవలం రెండు వేల రూపాయల లోన్ తీసుకున్న పాపానికి యువకుడు ఏకంగా సూసైడ్ చేసుకున్నాడు. పెళ్లై పట్టుమని నెల రోజుల కూడా కాలేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను సైతం వదిలి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడంతో ఆ కుటుంబం గుండెలవిసేలా తల్లడిల్లుతోంది..
ఆ యువకుడికి పెళ్లై సరిగ్గా నెల రోజులు అవుతుంది. అప్పుడే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు. యాప్‌లో లోన్ తీసుకోవడమే అతను చేసిన పాపం.. రూ.2వేలు మినహా మిగతా మొత్తం చెల్లించాడు.. అయితే.. ఆ రెండు వేల కోసం లోన్ యాప్ నిర్వాహకులు వేధించడం మొదలుపెట్టారు. కుటుంబ సభ్యుల ఫొటోలు మార్ఫింగ్ చేసి ఆ యువకుడికి తెలిసిన వాళ్లందరికీ పంపించారు.. అంతటితో ఆగకుండా.. భార్యకు కూడా పంపించారు. దీంతో ఆ యువకుడు తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు.. ఇంట్లో అందరూ నిద్రిస్తుండగా.. అర్థరాత్రి ఉరి వేసుకుని.. బలవన్మరణానికి పాల్పడ్డాడు.. ఈ దారుణ ఘటన విశాఖ నగరంలోని మహారాణిపేటలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. మహారాణిపేట అంగటిదిబ్బ ప్రాంతానికి చెందిన సూరాడ నరేంద్ర (21) అదే ప్రాంతానికి చెందిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వివాహం జరిగి 40 రోజులు అవుతోంది.. దంపతులిద్దరూ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే నరేంద్ర లోన్ యాప్ ద్వారా అప్పు తీసుకుని కొంత మేర చెల్లించేశాడు. మరో రూ.2వేలు మాత్రమే బాకీ ఉంది. ఈ క్రమంలో.. ఇటీవల బాకీ డబ్బులు చెల్లించాలని లోన్ యాప్ నిర్వాహకులు వేధించడం ప్రారంభించారు. అంతటితో ఆగకుండా మార్ఫింగ్ చేసిన ఫొటోలను అతని కుటుంబసభ్యులకు, భార్యకు పంపించారు.. నరేంద్రతో వెంటనే డబ్బులు కట్టించాలని, లేకుంటే మరిన్ని ఫొటోలు పంపిస్తామని వాళ్లందరికీ బెదిరింపు మెస్సెజ్ లు చేశారు.
దీంతో భార్య భర్తను ఈ విషయాన్ని అడిగింది.. లోన్ యాప్ వాళ్లకు రెండు వేలు చెల్లించాలని చెప్పాడు. ఆ తర్వాత తమ వద్ద ఉన్న రూ.2 వేలను వెంటనే లోన్ యాప్ నిర్వాహకులకు చెల్లించారు.. అప్పటికే యాప్ నిర్వాహకులు మార్ఫింగ్ ఫొటోలను నరేంద్ర ఫోన్ కాంటాక్ట్ లిస్టులో ఉన్న వాళ్లందరికీ పంపించేశారు. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన నరేంద్ర శనివారం అర్ధరాత్రి భార్య నిద్రలో ఉండగా ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో నరేంద్ర భార్య, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
వందేళ్ల జీవితాన్ని ఊహించుకొని పెళ్లి చేసుకున్న భర్త లేడని కుమిలిపోతుంది నరేంద్ర భార్య. ఇప్పుడు తనకు దిక్కు ఎవరు అని ఆవేదనకు గురవుతుంది.
Also read
- ఫాంహౌస్ నుంచి రాత్రి కాంట్రాక్టర్ను ఎత్తుకెళ్లిన దుండగులు.. ఉదయాన్నే సేమ్ ప్లేస్లో షాకింగ్ సీన్..!
- Guntur: గుంటూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్.. రూ.2 కోట్లు డిమాండ్ చేసిన వైకాపా నేత
- లక్కీ భాస్కర్ అవుతాం.. గోడ దూకి పారిపోయిన నలుగురు విద్యార్థులు..
- పోలీసుల అదుపులో మల్లికార్జునరావు
- Margasira Purnima: లక్ష్మీదేవి అనుగ్రహం మీ సొంతం కావాలంటే.. మార్గశిర పౌర్ణమి రోజున ఏమి చేయాలి? ఏమి చేయకూడదో తెలుసా