ప్రేమించాను అని వెంటపట్టాడు.. నీ గుండెల్లో చోటిస్తే.. జన్మ తహా గుండెల్లో పెట్టి చూసుకుంటా అన్నాడు.. ఏడు అడుగులు కాదు ఏడెడు జన్మలైనా వీడనని నమ్మ బలికాడు. పెద్దలని ఎదిరించారు. కులాలు వేరు అని చాలా గొడవలు జరిగాయి. పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కారు. చివరికి పెళ్లి చేసుకున్నారు. ఒక్కరోజులోనే స్టేట్‌లో బెస్ట్ లవర్స్ అంటూ హాల్ చల్ చేశారు. పెళ్లి అయి గట్టిగా ఒక సంవత్సరం కూడా పూర్తి కాలేదు. ఒక బిడ్డకు జన్మనిచ్చారు. కట్ చేస్తే మీ అమ్మాయి చనిపోయింది అని హఠాత్తుగా తల్లితండ్రులకు ఫోన్ చేసి చెప్పాడు. అమ్మాయిని కొట్టి చంపేశాడు అని అమ్మాయి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అతి చిన్న వయసులో ఎన్నో ఆశలతో తల్లిదండ్రులు అల్లారుముద్దుగా పెంచుకుని ఉన్నత చదువులు చదివించి.. మంచి ఉద్యోగం సంపాదించి.. కేవలం చిన్నతనంలో చదువుకున్న పరిచయంతో తన అర్హతకు సరికాకపోయినా తన సామాజిక వర్గం కాకపోయినా.. కేవలం నాగసాయి చెప్పిన మాటలు నమ్మి తన సర్వస్వం అర్పించి.. ఒక బిడ్డకు జన్మనిచ్చిన ఆ శివప్రియను కసాయి నాగసాయి ఎలా చంపాడో.. వాడికి మనసు ఎలా వచ్చింది అని ఆ తల్లిదండ్రులు రోదిస్తుంటే చూసేవారికి, వినేవారికి ఆ బాధ వర్ణనాతీతం.
ఆడపిల్ల పుడితే కొందరు ఎందుకు బాధపడతారు అని చాలామంది విమర్శలు చేస్తుంటారు. అనేకమంది సూచనలు సలహాలు ఇస్తూ ఉంటారు. కానీ ఈ విధమైన ఘటన జరిగినప్పుడు ఆ ఆడపిల్ల తల్లిదండ్రులు పడే బాధ.. అనుభవించే నరకం.. అది మాటల్లో చెప్పలేనిది, రాతల్లో రాయలేనిది. ప్రస్తుతం శివప్రియ భౌతికంగా లేదు. ఆమె ఎలా చనిపోయింది అనేది పోలీసులు తేల్చాల్సి ఉంది. కానీ శివప్రియ లేదు అనేది మాత్రం నిజం. నాగసాయి శివప్రియను చంపి ఉంటే వాడికి ఏ శిక్ష వేస్తే సరిపోతుంది.
నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం మర్రిపల్లికి చెందిన శివప్రియ అనే అమ్మాయిని నెల్లూరు రూరల్ ప్రాంతానికి చెందిన నాగసాయి అనే యువకుడు గత ఏడాది ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ రోజు అబ్బాయి ఇంట్లో అమ్మాయి ఉరేసుకుని చనిపోయిందని.. అమ్మాయి తల్లిదండ్రులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. కానీ అమ్మాయి తల్లిదండ్రులు మాత్రం గత కొన్ని రోజులుగా తమ కూతుర్ని నాగసాయితో పాటు అతని కుటుంబ సభ్యులు వేధిస్తున్నారని.. ఈ విషయంలో వారిలో మార్పు వస్తుందనుకుంటే ఈరోజు హఠాత్తుగా ఫోన్ చేసి మీ అమ్మాయి ఉరేసుకుని చనిపోయిందని చెబుతున్నారని అంటున్నారు. మా అమ్మాయిని నాగసాయి వాళ్లే కొట్టి చంపి ఉరివేసారని బోరున విలపిస్తున్నారు. శివప్రియను అపోలో ఆసుపత్రికి తీసుకెళ్లగా.. ఆమె ఆసుపత్రికి రాకముందే ఎప్పుడో చనిపోయిందని ఆసుపత్రి వైద్యులు తేల్చి చెప్పారు. శివప్రియ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు ఇచ్చే పనిలో ఉన్నారు. పోలీసులు ఈ కేసు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి నిజానిజాలు నెగ్గు తేల్చాల్సి ఉంది
Also read
- AP Crime: ఏపీలో మరో పరువు హత్య.. మైనర్ బాలికను చంపేసిన పేరెంట్స్!?
- సర్కార్ గట్టుకు మరమ్మతులు చేపట్టిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ళ రాము
- గురు, రాహువులతో ఆ రాశులకు ఐశ్వర్య యోగాలు..!
- Vastu Tips: ఈ పక్షులు ఇంటికొస్తే మీ దశ తిరిగినట్టే.. ఈ మూగజీవాలు ఇచ్చే సంకేతాలివే..
- నేటి జాతకములు.11 ఏప్రిల్, 2025