February 3, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

Andhra News: ఇంట్లో మహిళ.. గొడౌన్‌లో యువకుడు.. అలా కనిపించడంతో ఉలిక్కిపడిన గ్రామం..

విశాఖ జిల్లా పద్మనాభం మండలం కృష్ణాపురం గ్రామం. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ఆ గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.. ఇంట్లో ఓ వివాహిత ఫ్యాన్ కి ఉరి వేసుకుంది.. ఈ ఘటనతో గ్రామం అంతా తెలిసే లోగానే.. మరో విషాదకర వార్త.. గ్రామ శివారులో ఓ గొడౌన్లో అదే గ్రామానికి చెందిన యువకుడు విగత జీవిగా ఉన్నట్టు సమాచారం అందింది.


అది విశాఖ జిల్లా పద్మనాభం మండలం కృష్ణాపురం గ్రామం. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ఆ గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.. ఇంట్లో ఓ వివాహిత ఫ్యాన్ కి ఉరి వేసుకుంది.. ఈ ఘటనతో గ్రామం అంతా తెలిసే లోగానే.. మరో విషాదకర వార్త.. గ్రామ శివారులో ఓ గొడౌన్లో అదే గ్రామానికి చెందిన యువకుడు విగత జీవిగా ఉన్నట్టు సమాచారం అందింది. దీంతో అంతా వెళ్లి చూసేసరికి ఆ యువకుడు అప్పటికే ప్రాణాలు కోల్పోయి వేలాడుతూ కనిపించాడు. ఒకే రోజు జరిగిన ఈ ఘటనలతో కృష్ణాపురంలో ఒక్కసారిగా అలజడి మొదలైంది.. ఒకపక్క రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.. గ్రామం అంతటా విషాద ఛాయలు అలముకున్నాయి.. మరి ఒకేసారి ఇద్దరూ (వివాహిత, యువకుడు) ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారో అనే విషయంపై తీవ్ర చర్చ మొదలైంది. అయితే.. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు..


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణాపురం గ్రామానికి చెందిన శంకర్రావు అనే లారీ డ్రైవర్ .. పదేళ్ల క్రితం లక్ష్మి అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు. 8 ఏళ్ల తేజస్, ఆరేళ్ల తనుష్ ఉన్నారు. భర్త ఇంటి నుంచి విధులకు వెళ్లాడు.. ఏమైందో ఏమో కానీ ఇంట్లోనే లక్ష్మి ఫ్యానుకు ఉరి వేసుకుంది. ఆమె మరిది వచ్చి చూసేసరికి వేలాడుతూ కనిపించింది. గ్రామస్తుల సాయంతో ఆమెను కిందికి దింపారు. ఆ ఇంట్లో తీవ్ర విషాదం అలుముకుంది.

గ్రామ శివారులో…
లక్ష్మీ మృతితో ఆ గ్రామం తీవ్ర విషాదంలోకి వెళ్ళింది. ఇంతలో ఆ గ్రామానికి మరో షాకింగ్ సమాచారం అందింది. అదే గ్రామానికి చెందిన మొకర ఆదిత్య అనే 22 ఏళ్ల యువకుడు.. ఊరి శివారులో ఉన్న గోడౌన్లో ఉరి వేసుకున్నాడు. కొంతమంది మేకల కాపరులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యులు అక్కడ వెళ్లి చూసి ఉరివేసుకుని ఉన్న ఆదిత్యను చూసి కన్నీరు మున్నీరయ్యారు..


సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. ఒకే రోజు ఒకే గ్రామంలో ఇద్దరు ఉరివేసుకుని వేరువేరు చోట్ల ఆత్మహత్య చేసుకోవడం ఇప్పుడు మిస్టరీగా మారింది. మృతదేహాలను మార్చురికి తరలించిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. లక్ష్మీ గృహిణి.. కాగా.. ఆదిత్య ఒప్పంద కార్మికుడు. ఆత్మహత్యలతో లక్ష్మీ ఇద్దరు పిల్లలు అనాధలుగా మారారు.. ఇక ఆదిత్య ఆత్మహత్యతో ఒక్కగానొక్క కొడుకు ఆ తల్లిదండ్రులకు దూరమయ్యారు.. అయితే.. వీరిద్దరూ ఒకేరోజు.. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారన్న విషయంపై పోలీసులు ఆరాతీస్తున్నారు.. కాగా.. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది

Also Read

Related posts

Share via