July 1, 2024
SGSTV NEWS
Andhra PradeshAssembly-Elections 2024

Mudragada Padmanabham: పేరు మార్చుకుంటున్న ముద్రగడ.. ఇకపై “పద్మనాభరెడ్డి”



ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్.. తన సమీప ప్రత్యర్థి, వైసీపీ నేత వంగా గీతపై ఘన విజయం సాధించారు. అయితే పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పవన్ కల్యాణ్ బరిలో దిగిన సమయంలో.. వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం సంచలన సవాల్ విసిరారు. ఈ నియోజకవర్గం నుంచి పవన్ కల్యాణ్ విజయం సాధిస్తే.. తాను పేరు మార్చుకుంటానంటూ ముద్రగడ శపథం చేశారు.


ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సునామీ సృష్టించిన విషయం తెలిసిందే. టీడీపీ, బీజేపీ, జనసేనతో కూడిన కూటమి 164 శాసనసభ, 21 లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించింది. ఈ క్రమంలో ఎన్నికల ఫలితాలపై వైసీపీ సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం రియాక్ట్ అయ్యారు. కోట్లాది రూపాయాలతో ప్రజలకు సంక్షేమాన్ని అందించిన సీఎం జగన్ మాత్రమేనని.. దేశంలో మరెవరూ ఇలాంటి సాహసం చేయలేదన్నారు ముద్రగడ. కానీ ప్రజలు ఎందుకు ఓట్లు వేయలేదో అర్థం కావడం లేదు. ప్రజల ఫోకస్ సంక్షేమం కన్నా అభివృద్ధిపై ఉందా..? లేకపోతే వైసీపీకి మించి కూటమి సంక్షేమాన్ని ఆఫర్ చేయడం వల్ల అటు మొగ్గారో తెలియడం లేదన్నారు. సంక్షేమానికి ప్రజలు ఓటు వేయకపోతే.. రాబోయే రోజుల్లో ఏ ముఖ్యమంత్రి కూడా అటువైపు చూసే అవకాశం లేదన్నారు. ఇక ఈ ఎన్నికల్లో గెలిపొందిన నాయకులు శుభాకాంక్షలు తెలిపారు ముద్రగడ.


ఇక పిఠాపురంలో పవన్‌ను ఓడించకపోతే.. తన పేరును మార్చుకుంటానన్న మాటపై ఉన్నట్లు ముద్రగడ పద్శనాభం తెలిపారు. అన్న మాట ప్రకారమే.. తన పేరును పద్మనాభ రెడ్డిగా మార్చేందుకు గెజిట్ పేపర్స్ రెడీ చేసినట్లు తెలిపారు. రెండు, మూడు రోజుల్లో దరఖాస్తు చేయబోతున్నట్లు తెలిపారు. తన పేరు మారిన తర్వాత మళ్లీ ఆ వివరాలు తెలుపుతానన్నారు. ఇక తనను ఉప్మా పద్మనాభం పదే, పదే ట్రోల్ చేయడం కరెక్ట్ కాదన్నారు. ఇంటికి వచ్చిన వారికి టిఫిన్ పెట్టి మర్యాద చేయడంలో తప్పు లేదన్నారు. తన తాతలు, తండ్రి కాలం నుంచి ఈ ఆనవాయితీ వస్తుందన్నారు

Also read

Related posts

Share via