June 29, 2024
SGSTV NEWS
Andhra PradeshCrime

NTR District: ఆ ఊర్లో 9వ తరగతి అమ్మాయి.. ఈ ఊర్లో 9వ తరగతి అమ్మాయి మిస్సింగ్.. కట్ చేస్తే..

మీ పిల్లలు స్కూల్లో చదువుతున్నారా..? హాస్టల్స్‌లో ఉంచుతున్నారా..? అయితే వారి ప్రవర్తనను ఎప్పటికప్పుడు అబ్జర్స్ చేయండి. ట్రాక్ తప్పే ప్రమాదముంది. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఉండదు… తాజాగా ఎన్టీఆర్ జిల్లాలో ఏం జరిగింది అంటే….?

సోషల్ మీడియా ఎంత చేటు చేస్తుందో చెప్పడానికి ఈ ఘటనే ఉదాహారణ. కౌమార దశలోని పిల్లలకు సోషల్ మీడియా చాలా డేంజర్ అనే చెప్పాలి. వాళ్లు దాన్ని మిస్ యూజ్ చేసే అవకాశం ఉంది. తాజాగా ఎన్టీఆర్ జిల్లా ప్రేమ పేరుతో ఇద్దరు మైనర్లు జంప్ అయ్యారు. ఇద్దరూ వేరు.. వేరు స్కూల్స్‌లో9వ తరగతి చదువుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం అయింది. అట్రాక్షన్‌ను లోనయ్యారు. దానికి ప్రేమ అనే పేరు పెట్టారు. ఈ పెద్దవాళ్ల నుంచి దూరంగా వెళ్లాలని భావించి.. ఇద్దరూ కలిసి ఎస్కేప్ అయ్యారు.

Also read :తేజస్వి మిస్సింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం.. డిప్యూటీ సీఎం పవన్ కీలక ఆదేశాలు..

బాలుడిది ఎన్టీఆర్ జిల్లాలోని పోచంపల్లి గ్రామం కాగా.. బాలికది గండ్రాయి. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు మైనర్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Also read :విమాననగర్‎లో వింత వింత శబ్దాలు.. అర్థరాత్రి రోడ్లపైకి జనం.. జరిగిందిదే..

Related posts

Share via