పెళ్లైన దగ్గర్నుంచే అత్తింటివారి వేధింపులు.. వాటిని పంటి బిగువన భరించింది. అయినదానికి కానిదానికి సూటి పోటి మాటలు అంటే.. సర్దుకుపోయింది. తాజాగా ఆమె కడుపు పండింది. అయినా ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది.
మూడు పదులు వయసు రాకుండానే తనువు చాలించింది ఆ వివాహిత. అత్తింటివారి వేధింపులో, మరో కారణమో తెలియదు కానీ ఆమె ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి వచ్చి వైద్యం చేయించుకోకుండా పిఠాపురం రైల్వే స్టేషన్లో రైలు ఎక్కి వెళ్లిపోయింది. రైలులో ప్రయాణిస్తున్న ఆమె… గొల్లప్రోలు మండలం చేబ్రోలు-దుర్గాడ సమీపంలో భోగి నుంచి దూకి తనువు చాలించింది.
వివరాల్లోకి వెళ్తే… పెద్దాపురం మండలం చదలవాడ గ్రామానికి చెందిన దివ్యకు గొల్లప్రోలుకు చెందిన తొగర రమేష్‌తో మూడు సంవత్సరాల క్రితం పెళ్లి అయింది. పెళ్లయిన తొలినాళ్ల నుంచే అత్తింట్లో ఆమెకు వేధింపులు మొదలయ్యాయి. ప్రతి చిన్న విషయాన్ని అత్తింటి వారు భూతద్దంలో చూపి దివ్యను వేధింపులకు గురిచేసేవారు. ఆ ఒత్తిడితో రెండుసార్లు ఆమెకు గర్బస్రావం కూడా జరిగిందని చెప్తున్నారు మృతురాలి తల్లింటివారు. పిల్లలు లేరని రోజూ సూటి పోటీ మాటలతో వేధించేవారని చెబుతున్నారు. అయితే తాజాగా గర్భం దాల్చిన ఆమెను చికిత్స నిమిత్తం పిఠాపురంలో ప్రైవేట్ ఆసుపత్రికి మావయ్య గొల్లబ్బాయి తీసుకువెళ్లాడు. ఆస్పత్రిలో అపాయింట్‌మెంట్ తీసుకోగా… వైద్యం చేయించుకోవడానికి టైం పడుతుందని చెప్పడంతో హోటల్‌కి తీసుకెళ్లి దివ్యకు టిఫిన్ ఇప్పించాడు. అలాగే పిఠాపురం మార్కెట్లో పని చూసుకొని వస్తానని చెప్పి అక్కడి నుంచి మావయ్య గొల్లబ్బాయి వెళ్లిపోయాడు.. తీరా వచ్చేసరికి ఆమె కనిపించలేదు. చుట్టుపక్కల వెతికినా ఆచూకి దొరకలేదు దీంతో.. పిఠాపురం పోలీస్ స్టేషన్‌లో బంధువులు మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. 24 గంటలు గడవకముందే ఆమె చేబ్రోలు గొల్లప్రోలు మధ్యలో ఉన్న రైల్వే ట్రాక్‌పై శవమై తేలింది.. అత్తింటి సూటి పోటి మాటలు… అదనపు కట్నం వేధింపులు వల్లే దివ్య మరణానికి కారణం అంటూ బంధువులు ఆరోపణ చేస్తున్నారు. దివ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి రైల్వే పోలీసులు తరలించారు. సమగ్ర దర్యాప్తు తర్వాతే దివ్య మృతి మిస్టరీ వీడనుంది.
ఇవి కూడ చదవండి
- Astro Tips: మాంగళ్య దోషమా.. ఆర్ధిక ఇబ్బందులా.. అరటి చెట్టుకి ఇలా పూజించండి.. శుభఫలితాలు మీ సొంతం..
- Telangana: నర్సులుగా వైద్య సేవలు అందిద్దామనుకున్నారు… కానీ బొలెరో రూపంలో
- అయ్యో చిట్టితల్లి.. అప్పుడే నూరేళ్లు నిండాయా.. స్కూల్ టాపర్.. రిజల్ట్ చూడకుండానే..
- తన భార్యపై మోజు పడ్డాడని.. ప్రైవేట్ పార్ట్స్‌పై తన్ని.. మృతదేహంపై నిల్చోని.. పెద్దపల్లిలో దారుణ హత్య!
- Tirumala Alert: పూజలు పేరుతొ కేటుగాడి మోసం.. తిరుమలలో జాగ్రత్త..