November 21, 2024
SGSTV NEWS
Andhra PradeshCrime

ఫేస్‌బుక్ పరిచయంతో పెళ్లి.. కట్ చేస్తే, భర్త కువైట్‌లో.. భార్య అత్తగారింట్లో.. చివరకు

ఫెస్‌బుక్ పరిచయం.. పెళ్లిదాకా తీసుకెళ్ళింది.. కానీ.. భర్త, అతని కుటుంబసభ్యుల తీరుతో ఓ మహిళ జీవితం అర్ధాంతరంగా ముగిసింది.. భర్త గల్ఫ్ కంట్రీలో ఉండటం.. ఆమె అత్తగారింట్లో ఉండటం.. కట్ చేస్తే పెళ్లైన ఏడాదిన్నరకే.. ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం పలు ప్రశ్నలకు తావిస్తోంది.. ఈ విషాదకర ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా పీలేరులో చోటుచేసుకుంది.. పీలేరుకు చెందిన ఒక యువతి ఫేస్బుక్ ప్రేమాయణం, పెళ్లి విషాదంగా ముగిసింది.

స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. వాల్మీకిపురం గ్రామానికి చెందిన అమీర్ జాన్ కుమారుడు 24 ఏళ్ల వసీమ్‌కు పీలేరులోని మల్లెల వీధికి చెందిన మల్లెల రెడ్డి బాషా కూతురు 22 ఏళ్ల అర్షియ మధ్య ఏడాదిన్నర క్రితం ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం పెళ్లి దాకా తీసుకెళ్లింది.. ఫేస్బుక్ పరిచయంతోనే ప్రేమించుకున్న ఇద్దరూ.. పెద్దల్ని ఒప్పించి పెళ్ళి కూడా చేసుకున్నారు. అయితే అప్పటికే వసీం కువైట్‌లో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాడు.. ఈ క్రమంలోనే.. అక్కడ ఆఫర్ వచ్చింది.. అర్షియను పెళ్లాడిన నెలన్నరకే కువైట్ కు వెళ్ళిపోయాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వసీం కువైట్ వెళ్లిపోవడంతో అర్షియ వాల్మీకిపురంలోనే అత్తామామలతో ఉండాల్సి వచ్చింది. కొన్ని రోజులు బాగానే ఉన్నా అర్షియకు అత్తగారింట్లో వేధింపులు ప్రారంభమయ్యాయి. అత్తమామ, వసీం మేనమామ మనూర్ అలీ, ఆడపడుచులు కట్నం కోసం వేధించారు.. చిత్రహింసలు ఎక్కువ కావడంతో అర్షియ భరించలేకపోయింది. ఈ విషయాన్ని భర్త వసీంకు చెప్పింది.. అయితే.. వసీం దాన్ని పట్టించుకోలేదు.. భర్త తీరుతో బాధపడుతూ వచ్చింది.

ఈ క్రమంలోనే.. అత్తారింట్లో జరుగుతున్న గొడవలు, వేధింపుల విషయంపై అర్షియ మాట్లాడేందుకు రెండ్రోజుల క్రితం పీలేరులోనీ పుట్టింటికి వచ్చింది.. ఆ తర్వాత తిరిగి సాయంత్రమే వాల్మీకిపురంలోని అత్తవారింటికి చేరుకుంది. ఇంటికి వచ్చిన గంటలోపే ఆర్షియ సెల్‌ఫోన్ ఆఫ్ అయింది.. ఈలోపే అర్షియ ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం పీలేరులో ఉన్న తల్లిదండ్రులకు అందింది. ఉరి వేసుకుని మృతి చెందిందని.. వాల్మీకిపురం ప్రభుత్వాస్పత్రిలో డెడ్ బాడీ ఉందని చెప్పడంతో అర్షియ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు.

ఉదయం ఇంటికి వచ్చి కష్టాలు, బాధలు చెప్పుకున్న కూతురు సాయంత్రానికి శవంగా మారడంపై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఆర్షియను అత్తారింటి వారే హతమార్చారని, హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు అర్షియ తల్లిదండ్రులు. భర్త వసీం, అత్తామామలే అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేసి హతమార్చి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు.

ఆర్షియ మృతిని అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు.. ఇంటిని పరిశీలించిన పోలీసులు క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. అర్షియా అత్తామామలను అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. ఫేస్బుక్ పరిచయం పెళ్లి వరకు వెళ్లినా.. వసీం అక్రమ్.. అతని కుటుంబసభ్యుల తీరుతో అర్షియా జీవితం ఇలా ఏడాదిన్నరలోపే అర్ధాంతరంగా ముగిసి పోయిందని కుటుంబసభ్యులు రోదిస్తున్నారు

Also read

Related posts

Share via