November 21, 2024
SGSTV NEWS
Andhra PradeshCrime

తాళి కట్టే నిమిషం ముందు ఊహించని ట్విస్ట్.. సినిమా లెవల్లో పోలీసులు ఎంట్రీ

కర్నూలు జిల్లా ఓ చీటర్ మోసం పెళ్లిపీటలపై బట్టబయలైంది. ఓ అమ్మాయి నిండు జీవితం నిలబడింది. వెల్దుర్తి మండలం రామల్లకోటకు చెందిన యువకుడు.. విశాఖపట్నంలో ఓ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన ఓ యువతితో అతనికి సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడింది. అది కాస్తా సహజీవనం వరకూ వెళ్లింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆ యువతిని లోబర్చుకున్నాడు. ఆ తర్వాత మొహం చాటేసి కర్నూలు జిల్లా కల్లూరుకు చెందిన యువతిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు.

వెల్దుర్తి మండలం బ్రహ్మగుండం క్షేత్రంలో బుధవారం ఉదయం 9 గంటలకు పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అయింది. గుడిలో ఏర్పాట్లన్నీ చేశారు. బంధువులంతా వచ్చారు. తీరా వధూవరులు పెళ్లి పీటలు ఎక్కే సమయంలో పెళ్లి కూతురు కుటుంబసభ్యులకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. పెళ్లికొడుకు తన ప్రియుడంటూ.. పిల్లలు కూడా ఉన్నారంటూ ఆ యువతి చెప్పింది. ఫోటోలు, వీడియోలు కూడా షేర్ చేసింది. దీంతో షాక్‌కి గురైన పెళ్లికూతురు బంధువులు వెంటనే పెళ్లి ఆపేశారు. పెళ్లికూతురు కుటుంబీకులకు ఖర్చుల కింద లక్ష రూపాయలు చెల్లించి క్షమాపణలు చెప్పారు పెళ్లికొడుకు కుటుంబీకులు. పెళ్లి ఆగిపోవడంతో మిత్రులు, బంధువుల ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయారు.

ఒకరిని తల్లిని చేసి.. మరొకరితో పెళ్లికి సిద్ధపడ్డ ఆ యువకుడు.. ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలువురి దగ్గర డబ్బులు కూడా తీసుకున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. అతగాడిని అదుపులోకి తీసుకుని పూర్థి స్థాయిలో ఎంక్వైరీ చేయాలని పలువరు కోరుతున్నారు.



Also read  

Related posts

Share via