విజయనగరం జిల్లాలో మోసాలకు పాల్పడి కటకటాల పాలయ్యాడు ఓ ప్రవేట్ బ్యాంక్ మేనేజర్. జిల్లా కేంద్రంలోని ఎస్పీ బంగ్లా జంక్షన్లో రెప్కో హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్‌కు చెందిన కార్యాలయం ఉంది. ఆ బ్యాంక్ ఖాతాదారులకు హోమ్ లోన్స్ ఇస్తుంటుంది. ప్రభుత్వ, ప్రవేట్ ఉద్యోగులు, చిరు, మధ్య తరగతి వ్యాపారులు ఎక్కువగా ఈ బ్యాంక్‌లో హోమ్ లోన్స్ పొందుతుంటారు. జాతీయ బ్యాంకుల్లో రుణాలు పొందడానికి అర్హత లేని కస్టమర్స్ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఈ బ్యాంకులో హోమ్ లోన్స్ తీసుకుంటూ ఉంటారు. జాతీయ బ్యాంకుల కన్నా ఈ ప్రవేట్ బ్యాంక్‌లో వడ్డీ అదనంగా ఉన్నా ఇక్కడ త్వరగా హోమ్ లోన్స్ మంజూరు అవుతాయి. కాబట్టే ఇల్లు కొనాలనుకునే వారు ఇక్కడ
రుణాలు పొందుతుంటారు. ఈ బ్యాంక్‌కి ఇంచార్జ్ మేనేజర్ గా ప్రవీణ్ కుమార్ అనే ఉద్యోగి ఉన్నాడు. రుణాలు మంజూరు చేయడానికి కానీ, అలాగే రుణాలు పొందిన కస్టమర్ల వద్ద నుండి తిరిగి ప్రతినెల ఈఎంఐ లు కట్టించడానికి కానీ మేనేజర్ ప్రవీణ్ క్రియాశీలంగా వ్యవహరిస్తుంటాడు.
Also read :ఈ ఆటోలో అలా చేస్తూ.. అడ్డంగా దొరికిపోయిన ప్రేమ జంట.. ఎక్కడంటే..
ఈ క్రమంలోనే పలువురు కస్టమర్లు నేరుగా బ్యాంక్‌కు వచ్చి మేనేజర్‌కు తమ నెలవారీ ఈఎంఐలు కడుతుంటారు. మరికొందరు కస్టమర్స్ ఇళ్లకి వెళ్లి రికవరీ ఏజెంట్స్ రికవరీ చేసి ఆ డబ్బు కూడా మేనేజర్‌కి అందజేస్తారు. అలా ఖాతాదారుల నుండి రికవరీ చేసిన సొమ్మును వెంటనే మేనేజర్ ప్రవీణ్ కుమార్ బ్యాంక్ ఖాతాకు జమ చేయాలి. కానీ ప్రవీణ్ మాత్రం అలా చేయకుండా రికవరీ అయిన సొమ్మును తమ సొంతానికి ఖర్చు పెట్టుకున్నాడు. అలా మొత్తం సుమారు రూ.34 లక్షలు కాజేశాడు. అయితే కస్టమర్స్ నెలవారీ ఈఎంఐ బ్యాంక్ మేనేజర్‌కి కట్టినప్పటికి బ్యాంక్ ప్రధాన కార్యాలయం కాల్ సెంటర్ నుండి కస్టమర్స్‌కి నిరంతరం ఈఎంఐ కట్టాలని ఫోన్ కాల్స్ వస్తుండేవి. దీంతో కస్టమర్స్ బ్యాంక్ మేనేజర్‌ను కలిస్తే టెక్నికల్ ప్రాబ్లం వల్ల అలా కాల్స్ వస్తున్నాయి మీరు పట్టించుకోకండి అని మాయమాటలు చెప్పి నమ్మించేవాడు.
అయితే బ్యాంక్ కాల్ సెంటర్ నుండి వచ్చే ఫోన్ కాల్స్‌కి కస్టమర్స్ మాత్రం తాము ఈఎంఐ కట్టామని చెప్పడంతో కొద్దిరోజులకు బ్యాంక్ ఉన్నతాధికారులకు అనుమానం వచ్చింది. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు ప్రవీణ్ కుమార్‌ని అడిగితే కస్టమర్స్ మన కార్యాలయానికి కట్టలేదని చెప్పేవాడు. అయితే ప్రవీణ్ కుమార్ మాటలపై అనుమానం వచ్చిన బ్యాంక్ నిర్వాహకులు లోతైన దర్యాప్తు జరుపగా ఈఎంఐల కోసం కస్టమర్స్ ఇచ్చిన డబ్బు ప్రవీణ్ కుమార్ కాజేశాడని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. వెంటనే పోలీసులకు పిర్యాదు చేశారు బ్యాంక్ రీజనల్ మేనేజర్. దీంతో పోలీసులు తమదైన విచారణ జరపగా తాను తన సొంత అవసరాలకు వాడుకున్నట్లు అసలు వాస్తవాలు వెల్లడించాడు ప్రవీణ్ కుమార్. దీంతో బ్యాంక్ మేనేజర్ గా ఉండి మోసాలకు పాల్పడ్డ ప్రవీణ్ కుమార్‌ను పోలీసులు న్యాయప్రక్రియ ప్రకారం కటకటాలకు పంపారు.
Also read :Mahadev Mandir: ఈ ఆలయంలో డబ్బులు, కానుకలు నిషేధం.. శివయ్యకు జలం సమర్పిస్తే చాలు..