February 23, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

Vizag: అసలు మనిషివేనరా.. జాబ్‌లో నుంచి తీసేశారని.. పిల్లల వార్డు ఆక్సిజన్‌ వైర్లు కట్ చేశాడు..



వీడు అసలు మనిషేనా?.. పసిపిల్లల ప్రాణాలతో చెలగాటమా?.. ఉద్యోగంలోంచి తీసేసారనే కోపంతో పిల్లల వార్డులోని ఆక్సిజన్‌ సరఫరా ఆపేశాడో నీచుడు.. సిబ్బంది కానీ అప్రమత్తం కాకుంటే ఏకంగా 150 మంది పసిపిల్లల ప్రాణాలు పోయేవి.. ఆస్పత్రి వర్గాలకు బ్యాడ్ నేమ్ తేవాలనే అతను ఇలా చేశాడని పోలీసులు చెబుతున్నారు.


విశాఖ KGHలో జరిగిన ఈ ఘటనతో నగరమంతా ఉల్కిపడింది. NICUకు వెళ్లే ఆక్సిజన్‌ సరఫరా నిలిపిసి పసిపిల్లల ప్రాణాలతో రౌడీషీటర్లు చెలగాటమాడారు. ఏకంగా ఆక్సిజన్‌ పైపులు కట్‌ చేసేందుకు యత్నించారు. తనను ఉద్యోగంలో తీసేసారనే కోపంతో ఈ నిర్వాకానికి పాల్పడ్డాడు. ఐతే సిబ్బంది అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. సెక్యూరిటీ అతన్ని అడ్డుకోగా.. కత్తితో బెదిరించి దాడికి కూడా యత్నించారు.  ఈ ఘటనపై సీపీకి ఫిర్యాదు చేశారు ఆస్పత్రి సూపరింటెండెంట్‌.  రౌడీషీటర్‌ రేపుల రాజు సహా ముగ్గురిని అరెస్ట్‌ చేశారు పోలీసులు.

ఆ NICU వార్డులో మొత్తం 150 మంది పసిపిల్లలు ఉన్నట్లు చెప్పారు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ శివానంద్‌. సిబ్బంది అప్రమత్తతోనే పెను ప్రమాదం తప్పిందన్నారు. గతంలోనూ రేపుల రాజు ఇలాగే చేయగా.. పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు.. అయితే పోలీస్‌ కౌన్సిలింగ్‌ తర్వాత కూడా అతడిలో మార్పు రాలేదంటున్నారు..

రేపుల రాజుపై రౌడీషీట్‌ కూడా ఉందంటున్నారు సీఐ జీడీ.బాబు. గంజాయి మత్తుకు బానిస కావడంతో ఆసుపత్రి నుంచి రాజును సస్పెండ్ చేశారు. దీంతో వారిపై కక్ష పెంచుకున్న రాజు ఈ విధంగా చేశాడని చెబుతున్నారు. ఈ ఘటనలో రాజు సహా ముగ్గురిని అరెస్ట్‌ చేశారు.

Also read

Related posts

Share via