October 17, 2024
SGSTV NEWS
Andhra PradeshCrime

Ganesh Chaturthi: పండగ పూట రగడ.. మామిడాకుల కోసం వ్యక్తిపై కత్తితో దాడి!

పండగ పూట ఇళ్లంతా శుభ్రంగా కడిగి, తోరణాలు, పూలతో అలంకరించడం మన తెలుగోళ్లకు అలవాటు. అయితే తాజాగా జరిగిన వినియక చవితి పండగ నాడు తోరణాల కోసం ఓ వ్యక్తి మామిడి చెట్టు ఆకులు కోశాడు. దీంతో చెట్టు యజమని తనను అడగకుండా చెట్టు ఆకులు కోశాడని కత్తితో దాడి చేశాడు. ఈ దారుణ ఘటన కృష్ణా జిల్లా యనమలలో గత శనివారం (సెప్టెంబర్‌ 7) వినాయక చవితి పండగ నాడు..


యనమల, సెప్టెంబర్‌ 10: పండగ పూట ఇళ్లంతా శుభ్రంగా కడిగి, తోరణాలు, పూలతో అలంకరించడం మన తెలుగోళ్లకు అలవాటు. అయితే తాజాగా జరిగిన వినియక చవితి పండగ నాడు తోరణాల కోసం ఓ వ్యక్తి మామిడి చెట్టు ఆకులు కోశాడు. దీంతో చెట్టు యజమని తనను అడగకుండా చెట్టు ఆకులు కోశాడని కత్తితో దాడి చేశాడు. ఈ దారుణ ఘటన కృష్ణా జిల్లా యనమలలో గత శనివారం (సెప్టెంబర్‌ 7) వినాయక చవితి పండగ నాడు చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..

కృష్ణా జిల్లా యనమలకుదురులో వినియక చవితి పండగ పూట విషాద ఘటన చోటు చేసుకుంది. శనివారం ఉదయం మిర్యాల అర్జునరావు (61) అనే వ్యక్తి గణేష్ చతుర్థిని పురస్కరించుకుని మామిడి ఆకుల కోసం బంధువుల ఇంటికి వెళ్లాడు. ఆ ఇంట్లో ఎవరినీ అడగకుండా చెట్టు ఆకులు కోశాడు. దీంతో ఆ ఇంటి యజమాని గెడ్డం నాంచారయ్య (36) అనే వ్యక్తి తమ అనుమతి లేకుండా ఇంటిలోని మామిడి ఆకులు ఎలా కోస్తావంటూ అర్జునరావుతో వాగ్వాదానికి దిగాడు. దీంతో మాట మాట పెరిగింది. తీవ్ర కోపోధ్రిక్తుడైన నాంచారయ్య వంటగదిలోని కత్తి తీసుకువచ్చి అర్జునరావుపై దాడి చేశాడు. తీవ్ర గాయాల పాలైన అర్జునరావును స్థానికులు ఆసుపత్రికి తరలించారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also read

Related posts

Share via