రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసులో ముమ్మర దర్యాప్తు కొనసాగుతోంది. నిన్న సీఐడీ చీఫ్ రంగంలో దిగితే… ఇవాళ రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సిసోడియా ఫీల్డ్ విజిట్ చేశారు.
Also read :గ్యాస్ లీకై పేలిన ఆటో.. భారీగా ఎగిసిపడ్డ మంటలు..ఆ భయానక దృశ్యాలు ఇవిగో..
అన్నమయ్య జిల్లా మదనపల్లి ఫైల్స్ దహనం కేసులో… ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేశారు అధికారులు. నిందితులను వెంటనే గుర్తించాలన్న ప్రభుత్వ ఆదేశాలతో… ఏ ఒక్క క్లూ దొరికినా వదిలిపెట్టట్లేదు. ఇప్పటికే సీసీటీవీ ద్వారా కీలక ఆధారాలు సేకరించిన అధికారులు… పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Also read :Hyderabad: ఆరుగురు అమ్మాయిలు.. 14 మంది అబ్బాయిలు.. అపార్ట్‌మెంట్‌లోనే మకాం పెట్టారు.. చివరకు..
ఇటు రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సిసోడియా సైతం రంగంలోకి దిగారు. సబ్‌కలెక్టర్ ఆఫీసును క్షుణ్ణంగా పరిశీలించారు. కార్యాయలంలో ఉన్న వాళ్లే ఫైల్స్ దహనం చేసి ఉండవచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. లక్షల్లో ఉండాల్సిన ఫైల్స్ వేలల్లోనే ఉన్నాయన్నారు. మాధవరెడ్డి అనే వ్యక్తి పరారీలో ఉన్నారన్న ఆయన… ఫోరెన్సిక్ నివేదిక తర్వాత చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
Also read :America: అమెరికాలో నకిలీ క్యాన్సర్ మందులు విక్రయిస్తున్న బీహార్‌కు చెందిన సంజయ్.. నేరం రుజువైతే ఏళ్ల జైలుశిక్ష?
ఇక గురువారం సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్… సబ్ కలెక్టరేట్ కార్యాలయాన్ని పరిశీలించారు. కేసు పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పలు కీలక ఆధారాలను… సీఐడీ చీఫ్‌కి అధికారులు అందించారు. మొత్తంగా అధికారులు… ఈ కేసులో నిందితులు ఎవరో ఒక అంచనాకి వచ్చినట్లు తెలుస్తోంది. రేపో, ఎల్లుండో సరైన ఆధారాలతో వెల్లడించే అవకాశం కనిపిస్తోంది
Also read :ఐఏఎస్ సంతకం ఫోర్జరీ.. కష్టాల్లో నగర మేయర్.. ఏం జరిగిందంటే..