కృష్ణా జిల్లా, గన్నవరం మండలం, సూరంపల్లి గ్రామంలో గుర్రం శ్రీకాంత్ అనే యువకుడిని గ్రామస్తులు బంధించారు. ప్రేమ పేరుతో అదే గ్రామానికి చెందిన గుడ్డేటి ప్రసన్న (తల్లిలేని యువతి)ను ప్రేమలోకి దింపాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. అతని మాటలు నమ్మిన యువతి కూడా అతనిని ప్రేమించింది, అయితే…
కృష్ణా జిల్లా: గత కొంత కాలంగా ఆ జంట ప్రేమించుకుంటున్నారు. అయితే విషయం తెలుసుకునన యువకుడి బంధువులు వారి పెళ్లికి నిరాకరించారు. విషయం తెలుసుకున్న గ్రామ పెద్దలు… విచారణ జరిపి గ్రామస్తుల సమక్షంలో ఆ ప్రేమ జంటకు అర్ధరాత్రి పెళ్లి (Midnight wedding) జరిపించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. కృష్ణా జిల్లా (Krishna Dist.,), గన్నవరం మండలం, సూరంపల్లి గ్రామంలో గుర్రం శ్రీకాంత్ అనే యువకుడిని గ్రామస్తులు బంధించారు. ప్రేమ పేరుతో అదే గ్రామానికి చెందిన గుడ్డేటి ప్రసన్న (తల్లిలేని యువతి)ను ప్రేమలోకి దింపాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. అతని మాటలు నమ్మిన యువతి కూడా అతనిని ప్రేమించింది, అయితే ఈ పెళ్లికి యువకుడి బంధువులు నిరాకరించారు. దీంతో సూరంపల్లి గ్రామ మహిళలు శ్రీకాంత్ ను తాళ్లతో బంధించారు. విషయం తెలుసుకున్న యువకుడి తల్లిదండ్రులు, బంధువులు సంఘటన ప్రదేశానికి చేరుకున్నారు.. కులాలు వేరు కావడంతో పెళ్ళికి నిరాకరించారు. దీంతో సూరంపల్లి గ్రామ పెద్దలు విచారణ జరిపి శ్రీకాంత్, ప్రసన్నలకు గ్రామస్తుల సమక్షంలో వివాహం జరిపించారు
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025