November 21, 2024
SGSTV NEWS
Andhra Pradesh

AP News: చెరువు కబ్జా అంటూ నోటీసులు.. స్పందించిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి

ధర్మవరం పట్టణానికి ఆనుకుని ఉన్న చిక్కవడియార్‌ చెరువును ఆక్రమించారంటూ నీటి పారుదలశాఖ అధికారులు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి బంధువులకు నోటీసులు జారీ చేశారు. వారం రోజుల్లోగా కబ్జా చేసిన స్థలాలను ఖాళీ చేయకపోతే అందులో ఉన్న నిర్మాణాలు, చెట్లు, పంటలను గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంటుందని నోటీసుల్లో పేర్కొన్నారు.


— సత్యసాయి జిల్లా ధర్మవరం వడియార్ చెరువు విస్తీర్ణంపై వివాదం రాజుకుంది. ప్రభుత్వ భూమిని ఆక్రమించారని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సోదరుడి భార్యకు జలవనరుల శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. 20 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించినట్లు నోటీసులిచ్చారు. ఏడు రోజుల్లో చెరువు భూమిని ఖాళీ చేయాలని అధికారులు నోటీసుల్లో సూచించారు.


— ఈ నోటీసులపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి స్పందించారు. ప్రభుత్వం మారినప్పటి నుంచి ఇబ్బందులు పెడుతున్నారని ఆయన మండిపడ్డారు. 904, 905, 908, 909 సర్వే నెంబర్లలో తన సోదరుడి భూములు ఉన్నాయని అంటున్నారు కేతిరెడ్డి. సర్వే నెంబర్ 661‌లో మాత్రమే ఇరిగేషన్ శాఖ భూమి ఉంది. తన సోదరుడి భూములు చెరువులోకి రావని స్పష్టం చేశారు.

ఈ నోటీసులపై ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించానని అంటున్నారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి. ఎలాంటి చర్యలు చేపట్టవద్దని కోర్టు సైతం చెప్పిందని గుర్తు చేస్తున్నారు. తన పరువుకు భంగం కలిగించిన వారిపై లీగల్‌గా ముందుకు వెళ్తానని అంటున్నారు. అన్ని ఆధారాలతో త్వరలో ప్రజల ముందుకు వస్తానని అంటున్నారు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి

Also read

Related posts

Share via