December 3, 2024
SGSTV NEWS
Andhra Pradesh

AP News: రైలులో ఆవుమాంసం.. పీఠాధిపతి ఎంట్రీతో హీటెక్కిన సీన్

మే 4, శనివారం.. గుంటూరు రైల్వే స్టేషన్‌లో తీవ్ర హైటెన్షన్ నెలకుంది. రైలులో ఆవుమాంసం తలరిస్తున్నారంటూ ఆరోపిస్తూ.. హిందూ, ధార్మిక సంఘాల వారు.. జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ను అడ్డుకున్నారు. హిందువులు పరమ పవిత్రంగా భావించి.. పూజించే ఆవును వధించి.. మాంసం తరలిస్తున్నారంటూ.. రైల్వేస్టేషన్‌లో హిందూసంఘాలు ఆందోళనకు దిగాయి. మాంసాన్ని తరలిస్తున్నవారిని అరెస్ట్ చేసేవరకు వెనక్కి తగ్గేది లేదని వారంతా గొడవకు దిగారు. గోమాంసం తరలింపును అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో రైల్వే స్టేషన్‌లో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. ట్రైన్ రాకపోకలకు  అంతరాయం కలిగింది. ఇదే సమయంలో తాళ్లాయపాలెం శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి కూడా రైల్వే స్టేషన్‌కు రావడంతో.. పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. ఆందోళనకారులతో కలిసి ఆయన కూడా రైల్ రోకోలో పాల్గొన్నారు. పరిస్థితి అదుపు తప్పడంతో.. రైల్వే పోలీసులు రంగంలోకి దిగారు. ఆందోళనకారులకు నచ్చజెప్పి.. మాంసం తరలింపుపై దర్యాప్తు జరుపుతామని హామీ ఇచ్చారు.

పోలీసుల జోక్యంతో.. హిందూసంఘాలు శాంతించాయి. జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ విశాఖ నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. అయితే రైలు రోకో కారణంగా జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లోని పాసింజర్స్ ఇక్కట్లు పడ్డారు. ట్రైన్ ప్రయాణానికి ఆటంకం కలగడంతో కాసేపు ఇబ్బందులకు లోనయ్యారు. అయితే పోలీసుల జోక్యంతో రైలు తిరిగి స్టార్టవ్వడంతో..  అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Also read

Related posts

Share via