November 22, 2024
SGSTV NEWS
Andhra PradeshCrime

ఫేక్ ఐడీలతో టార్చర్.. పెరుగుతున్న కేసులు.. సైబర్ క్రైమ్ పోలీసుల విచారణలో సంచలనాలు..!

పరువు తీసేలా ప్రచారాలు.. వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ మెసేజ్‌లు.. ఇప్పుడు విశాఖలో కొంతమంది మహిళలకు ఈ సమస్య తలనొప్పి తెచ్చిపెడుతోంది. గత కొంతకాలంగా తరచూ ఇటువంటి వేధింపులతో తలలు పట్టుకుంటున్నారు మహిళలు, యువతులు. సోషల్ మీడియా వేదికగానే సాగుతున్న ఈ టార్చర్ భరించలేక పోలీసులను ఆశ్రయిస్తున్నారు. అసలు దీని వెనుక ఉన్నది ఎవరన్న దానిపై సైబర్ క్రైమ్ పోలీసులు దృష్టి సారించారు.

డిజిటల్ యుగం వైపు ప్రపంచ పరుగులు పెడుతోంది. మొబైల్ ఫోన్‌కు ఇంటర్నెట్ కనెక్ట్ ఉంటే చాలు, అరచేతిలో ప్రపంచమంతా ఇమిడిపోతూ ఉంటుంది. ఏ ప్రాంతం నుంచి ఎక్కడికైనా సమాచారం పంపాలన్నా.. ప్రపంచంలోనే ఎక్కడి సమాచారాన్ని అయినా తెలుసుకోవాలనుకున్నా డిజిటల్ యుగంలో సోషల్ మీడియా అత్యంత ప్రభావంతంగా సేవలందిస్తోంది. ఇది నాణానికి ఒకవైపు మాత్రమే. మరోవైపు చూస్తే అంతా సోషల్ మీడియా వేదికగానే నేరాలు ఊపందుకున్నాయి. సోషల్ మీడియాను నేరగాళ్లు తమకు అస్త్రంగా మలుచుకుంటున్నారు.

సైబర్ నేరాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. విశాఖపట్నంలో నమోదవుతున్న కేసులు అందరినీ భయపడుతున్నాయి. ప్రధానంగా మహిళలు, యువతులే టార్గెట్‌గా చేసుకుని తప్పుడు ప్రచారాలు అసభ్యకరమైన మెసేజ్‌లు హడలెత్తిస్తున్నాయి. ఏ సమయంలో ఎవరి వంతు వస్తుందేమోనని మహిళలు, యువతులు భయపడిపోతున్నారు. ప్రధానంగా వర్కింగ్ ఉమెన్లు, కార్యాలయాలు, కంపెనీల్లో పనిచేసే మహిళలు, విద్యార్థులు ఇటువంటి నేరలకు బాధితులుగా మారుతుండడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది.

ఓ యువతి విశాఖ హెచ్‌పీసీఎల్‌లో మంచి పొజిషన్‌లో పనిచేస్తోంది. ఫేక్ ఇమెయిల్‌తో యువతికి వేధింపులు మొదలయ్యాయి. ఉద్యోగిని పట్ల అసభ్యంగా మెసేజ్‌లు, తప్పుడు ప్రచారం ఊపందుకుంది. చెక్ చేస్తే శత్రువులు ఎవరూ లేరు ఆమెకు. మరి ఎవరు ఇలా చేస్తున్నారు..? ఎంత గింజుకున్నా అంతు పట్టలేదు. మరోవైపు కెమికల్ కంపెనీలో ఇటువంటి ఘటనే జరిగింది. ఉద్యోగిని పరువు మర్యాదలు పోయేలా మెసేజ్‌లతో ప్రచారం సాగుతోంది. దీంతో ఆ ఉద్యోగిని డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. ఇక మరో మహిళకు ఇంస్టాగ్రామ్ లో వేధింపులు మొదలయ్యాయి. ఫ్రెండ్ రిక్వెస్ట్ చెక్ చేసిన పాపానికి.. ఆమెకు టార్చర్.

ఇక ఓ యువతికి పెళ్లి కుదిరింది. ఆమె చాలా సౌమ్యురాలు. కానీ ఆమె పట్ల అసభ్య ప్రచారం మొదలుపెట్టారు సైబర్ కేటుగాళ్ళు. ఓ యువతి ప్రైవేటు కంపెనీలో మంచి పొజిషన్‌లో పనిచేస్తోంది. ఆ యువతకి సోషల్ మీడియాలో వేధింపులు మొదలయ్యాయి. అసభ్య ప్రచారాలు టార్చర్. ఆమెకు శత్రువులు ఎవరూ లేరు. ఎంత గించుకున్న అవతలి వాళ్ళు ఎవరో అంత పట్టలేదు. దీంతో ఆ యువత డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది. ఇక మరో యువతికి కూడా ఇటువంటి హరాస్‌మెంట్. కాబోయే భర్తకు షాకింగ్ మెసేజ్‌లు పెడుతూ ఆమె పరువు తీసేలా ప్రచారం. ఇవి కేవలం ఉదాహరణలు మాత్రమే.. ఇంకా ఇటువంటి ఘటనలకు నిత్యం మహిళలు గురవుతూనే ఉన్నారు.

అయితే ఈ అన్ని కేసుల్లోనూ.. అవతలి వ్యక్తి ఎవరో వీళ్ళకు తెలియదు. పోనీ తెలుసుకుందామన్నా సరే అంటూ పట్టదు. ఎందుకంటే వాళ్లంతా సోషల్ మీడియాలో ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి, ఈ మెయిల్స్ ఇన్‌స్టాగ్రామ్, వాట్సప్‌ల ద్వారా ఈ హరాస్‌మెంట్ చేస్తున్నారు. రోజురోజుకీ పెరుగుతున్న వేధింపులతో బాధితులంతా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కు క్యూ కడుతున్నారు. రోజుకి ఇద్దరూ ముగ్గురు తమ బాధను చెప్పుకునేందుకు సైబర్ క్రైమ్ పోలీసుల వద్దకు పరుగులు తీస్తున్నారు. కేసులు నమోదు చేస్తున్న పోలీసులు.. హెచ్‌పీసీఎల్ ఉద్యోగినికి అసభ్య మెసేజ్‌లతో వేధిస్తున్న తప్పుడు ప్రచారం చేస్తున్నందుకు.. కడప జిల్లాకు చెందిన మల్లికార్జున నాయక్ అనే యువకుడిని గతేడాది అరెస్టు చేశారు. ఇన్‌స్ట్రాగ్రామ్‌లో.. వేధింపులకు గురి చేస్తున్న కేసులో కాకినాడకు చెందిన దుర్గాప్రసాద్ అనే యువకుడని పట్టుకున్నారు.

మరికొన్ని కేసులను చేధించి నిందితులను కటకటాల వెనక పెట్టారు. తాజాగా ప్రైవేట్ కంపెనీలో యువతీకి హరాస్‌మెంట్ కేసులో.. అదే కంపెనీలో మాజీ ఉద్యోగి డబ్బిరు సాయికుమార్‌ను తాజాగా అరెస్టు చేశారు పోలీసులు. అయితే ఈ అన్ని కేసులోనూ ఇన్వెస్టిగేషన్ చేసిన పోలీసులకు… షాకింగ్ నిజాలు తెలుసుకుంటున్నారు. పోలీసులే కాదు, ఎందుకు ఎవరో తెలిసి బాధితులు కూడా షాక్‌కు గురవుతున్నారు. ఎందుకంటే బాధితులకు నిందితులు ఇంతకుముందే పరిచయస్థులుగా ఉండడం విశేషం.

నిందితుల్లో చాలామంది ఉన్నత చదువులు చదువుతున్న వారే. తమకున్న పరిజ్ఞానంతో ఫేక్ ఈమెయిల్ ఐడీలు ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ ఐడీలు క్రియేట్ చేసి హరాస్‌మెంట్ చేస్తున్నారు. అనుకున్న యువతి తమకు దక్కలేదనో.. కంపెనీలో జెలసితోనో… వేధింపులకు గురి చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఇటీవల హెచ్‌పీసీఎల్ ఉద్యోగినికి వేధించిన మల్లికార్జున నాయక్.. గౌహతి ఐఐటీలో చదుకోవడం విశేషం. అయితే కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యులు కూడా నిందితులుగా ఉంటున్నారు. ఓ కేసులో తన మరిదిపై ఈ దారుణానికి పాల్పడింది వదిన. తాను ఇష్టపడని వ్యక్తిని పెళ్లి చేసుకోబోతుడంతో స్వయానా వదిన ఆ యువతిపై తప్పుడు ప్రచారం ప్రారంభించింది. ఇక మరో కేసులో సాయికుమార్ అనే నిందితుడు కంప్యూటర్స్‌లో గ్రాడ్యుయేట్ సిస్టమ్స్‌పై మంచి పట్టు. ప్రాక్సి‌తో విపిఎన్ క్రియేట్ చేసి అత్యంత చాకచక్యంగా హరాస్‌మెంట్ చేస్తున్నాడు. అయితే సోషల్ మీడియా వినియోగించే యువతులు మహిళలు కూడా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చూపిస్తున్నారు నిపుణులు.

ఈ మధ్యకాలంలో నమోదు అవుతున్న ఉమెన్ వేధింపుల కేసుల్లో.. చాలావరకు తెలిసిన వాళ్లు, ఇదివరకు పరిచయస్తులే విలన్లుగా తేలుతుండడం ఆందోళన కలిగించే విషయం. ఇటువంటి తప్పుడు ప్రచారాలతో చాలామంది బాధితులు ఆత్మహత్య చేసుకునే అంత స్థాయికి కూడా వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. ఇటువంటి సందర్భాల్లో బాధితులు సకాలంలో తమను ఆశ్రయించి ఫేక్ గాళ్ళ భరతం పట్టేందుకు సహకారం అందించాలని కోరుతున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. అందుకోసం ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు

Also read

Related posts

Share via